ఈ చిన్నారి యువరాణి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆమెకోసం కుర్రాళ్లు పడి చచ్చిపోతారు
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత ఇతర భాషల్లో బిజీ అయిపోతూ ఉంటారు. మన దగ్గర ఆఫర్స్ తగ్గితే చాలు లగేజ్ సర్దుకొని పక్క ఇండస్ట్రీలోకి జంప్ అవుతూ ఉంటారు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా తెలుగులో ఇలా మెరిసి అలా వెళ్లిపోయింది. ప్రస్తతం కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు కూడా అలానే ముద్దుగా ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కుర్రకారు గుండెల్లో ముద్ర వేసింది ఈ భామ. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు..
ఇది కూడా చదవండి : Jabardasth Sunny: నవ్వులు పంచే సన్నీ జీవితంలో ఇంత విషాదమా..! ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా..
భావన మీనన్ అంటే సడన్ గా గుర్తుపట్టకపోవచ్చు కానీ నీలిపురి గాజుల ఓ నీలవేణి పాటతో ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది. భావన మీనన్ తెలుగులో మూడు సినిమాల్లోనే నటించింది. 2008లో వచ్చిన ఒంటరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన హీరో అనే సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా బోల్తా కొట్టింది.
ఇది కూడా చదవండి : థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! ప్రభాస్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరో భార్య..
ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాలో నటించింది భావన. ఈ సినిమాలో నీలిపురి గాజుల ఓ నీలవేణి పాట బాగపాపులార్ అయ్యింది. సినిమా కంటే ఈ పాటతోనే కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది భావన. ఆ తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే టాలీవుడ్ ను వదిలేసింది. కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.
ఇది కూడా చదవండి : రోజుకు లక్ష నుంచి 3లక్షల రెమ్యునరేషన్.. డబ్బుల కట్టల పై పడుకునేది.. చివరకు అనాధలా
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి