Sampangi Movie: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఏమాత్రం తగ్గని అందం.. ఇప్పుడేం చేస్తుందంటే..

టాలీవుడ్ అడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో సంపంగి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 90's కుర్రాళ్లకు ఈ సినిమా హార్ట్ ఫేవరేట్ అనే చెప్పాలి. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Sampangi Movie: సంపంగి మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఏమాత్రం తగ్గని అందం.. ఇప్పుడేం చేస్తుందంటే..
Sampangi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2024 | 5:17 PM

టాలీవుడ్ అడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో సంపంగి ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 90’s కుర్రాళ్లకు ఈ సినిమా హార్ట్ ఫేవరేట్ అనే చెప్పాలి. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. హిందూ, ముస్లీం కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది.. ? ప్రాణ స్నేహితులుగా ఉన్న రెండు కుటుంబాల్లో వీరిద్దరి ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది ? అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథలో దీపక్ హీరోగా నటించగా.. కంచి కౌల్ కథానాయికగా నటించింది. అలాగే ఈ సినిమాలో చంద్రమోహన్, చలపతిరావు, సన, శివాజీ రాజా, రంగనాథ్ కీలకపాత్రలు పోషించారు.

మొదటి సినిమాతోనే తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ కంచి కౌల్. సంపంగి సినిమాలో ఈ అమ్మడి అందానికి, నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి సంపంగి సినిమా తర్వాత సరైన క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస సినిమాలతోపాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. 2005లో ఏక్ లడ్కీ అంజనీ సి టీవీ షాలో కనిపించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట చాలా యాక్టివ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తుంది. తాజాగా హీరోయిన్ కంచి కౌల్ ను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ అయిన సంపంగి హీరోయిన్ ను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 2011లో టీవీ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను వివాహం చేసుకుంది కంచికౌల్. వీరికి ఇద్దరు కుమారులు.

View this post on Instagram

A post shared by kanchikaul (@kanchikaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!