- Telugu News Photo Gallery Cinema photos Can you guess this actress in this childhood photo who was a youtuber and now is a famous actress, she is Ketika Sharma
Tollywood: ఒకప్పుడు యూట్యూబర్.. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఈ అమ్మడు ఎవరంటే..
నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఓవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసింది. యూట్యూబర్‌గా మొదలైన ప్రయాణం ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ గా మార్చింది. తనే హీరోయిన్ కేతిక శర్మ. ఈ బ్యూటీ నటించిన తొలి సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
Updated on: Sep 13, 2024 | 5:45 PM

నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఓవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసింది. యూట్యూబర్‌గా మొదలైన ప్రయాణం ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ గా మార్చింది. తనే హీరోయిన్ కేతిక శర్మ.

ఈ బ్యూటీ నటించిన తొలి సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ అమ్మడుకు మాత్రం తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. యంగ్ హీరోల సరసన ఆడిపాడిన ఈ అమ్మడికి ఇప్పుడు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

దీంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా కేతిక చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. చైల్డ్ హుడ్ ఫోటోను చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

కేతిక.. మోడల్ కమ్ నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోక ముందే యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పాపులర్ డైలాగ్స్, పాటల రీమిక్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 2021లో అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

తెలుగులో లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించి మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో కనిపించింది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.




