- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Sairat Movie Actress Rinku Rajguru, Know How She Is Looks Now
Tollywood: గుర్రంపై స్వారీ చేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించింది..
ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. పైన ఫోటో ఈ చిత్రంలోనిదే. ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న రింకు.
Updated on: Sep 13, 2024 | 7:15 PM

ఒకే ఒక్క సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే సైరత్. పైన ఫోటో ఈ చిత్రంలోనిదే.

ఈ చిత్రంలో ఆకాశ్ హీరోగా నటించగా.. రింకూ రాజ్ గురు కథానాయికగా నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న రింకు.. తన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సైరత్ చిత్రంలో అర్చీ పాత్రలో అలరించింది.

రింకూ ఇప్పుడు తన సినిమాలకే కాదు, తన లైఫ్ స్టైల్, అందాల విషయంలోనూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ చీరలో ఉన్న ఫోటోలను రింకూ పోస్ట్ చేసింది. నటి మరత్మోలా లుక్‌లో చాలా అందంగా ఉంది.

రింకుకు కేవలం మరాఠీ చిత్రపరిశ్రమలోనే కాకుండా హిందీ, తెలుగు భాషలలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా పింక్ పట్టు చీరలో అందంగా ఫోటోషూట్ చేసింది రింకు. అర్చీ పాత్రతో అడియన్స్ హృదయాలకు గెలుచుకున్న రింకు.. మల్టీ టాలెంటెడ్. నటన మాత్రమే కాదు.. రచయిత కూడా. అందమైన ప్రేమ కవిత్వాలు రాస్తుంది రింకు.

రింకూకి చదవడం అంటే ఇష్టమని.. ఇప్పటికే అనేక పుస్తకాలు చదివానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు తనకు అనుగుణంగా ఊహించుకుంటానని తెలిపింది.




