Shriya Saran: శ్రియా ఈజ్ బ్యాక్.. ఆ స్టార్ హీరో సరసన అందాల తార.. జోడీ అదుర్స్..
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, విజయ్ దళపతి, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని నెలలుగా తెలుగులో పలు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది శ్రియా.
Updated on: Sep 13, 2024 | 8:17 PM

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్ శ్రియా శరణ్. జ్యోతిక, సిమ్రాన్, త్రిష, ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, విజయ్ దళపతి, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

కొన్ని నెలలుగా తెలుగులో పలు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది శ్రియా. అయితే తాజాగా ఈ అమ్మడు హీరోయిన్ ఛాన్స్ అందుకుందట. కోలీవుడ్ సూర్య సరసన ఈ బ్యూటీకి ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది.

సూర్య 44వ చిత్రంలో శ్రియాను కథానాయికగా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు శ్రియాను కూడా కథానాయికగానే సెలక్ట్ చేశారంటూ టాక్ నడుస్తుంది. దీంతో అసలు ఈ చిత్రంలో శ్రియా పాత్ర ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.




