- Telugu News Photo Gallery Cinema photos Music Directors Tough Fight between Anirudh, Devi Sri Prasad, Thaman,
Music Directors War: స్వర సమరంలో త్రిమూర్తుల సంగ్రామం
పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. పైగా వాళ్ళ వాళ్ల కెరీర్స్‌కు కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం..?
Updated on: Sep 13, 2024 | 8:41 PM

పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. పైగా వాళ్ళ వాళ్ల కెరీర్స్‌కు కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం..?

టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ గుర్తుకొస్తారు. ఈ ఇద్దరి మధ్యే కొన్నేళ్లుగా పోటీ నడుస్తుంది. మధ్య మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్‌గా ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది.

తాజాగా వీళ్ళకు అనిరుధ్ కూడా తోడయ్యారు. ఈయన చేతిలో ఉన్న ఆయుధం దేవర. మరోవైపు దేవీ, తమన్ కూడా తగ్గట్లేదు.తెలుగులో అనిరుధ్‌కు జెర్సీ మినహా చెప్పుకోగద్గ విజయం లేదు. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ మ్యూజికల్‌గా ఓకే గానీ కమర్షియల్‌గా కాదు.

ఇలాంటి సమయంలో దేవర అనిరుధ్ కెరీర్‌కు కీలకంగా మారింది. దాంతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు అనిరుద్ధే సంగీత దర్శకుడు. మరోవైపు పుష్ప 2తో దేవీ.. గేమ్ ఛేంజర్‌తో తమన్ రేసులోనే ఉన్నారు.

అనిరుధ్ అంటే రీ రికార్డింగ్‌కు పెట్టింది పేరు. దేవరతో ఆ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారీయన. మరోవైపు పుష్ప 2తో తన స్థాయి గుర్తు చేయాలని దేవీ శ్రీ ప్రసాద్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక తమన్ అయితే గేమ్ ఛేంజర్‌తో పాటు ఓజి, NBK109 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురి మధ్య స్వర సమరం మామూలుగా లేదు.