- Telugu News Photo Gallery Cinema photos Regina Cassandra reveals she had many relationships in her life
నేను సీరియల్ డేటర్.. నాకు చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయ్.. అసలు విషయం చెప్పేసిన రెజీనా
సుధీర్ బాబుతో కలిసి శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెజీనా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. శివ మనసులో శృతి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి.
Updated on: Sep 13, 2024 | 3:07 PM

సుధీర్ బాబుతో కలిసి శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెజీనా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. శివ మనసులో శృతి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి అవకాశాలు పెరిగాయి.

ఆ తర్వాత సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన రోటీన్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త జంట, రారా కృష్ణయ్యా, పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, శౌర్యం, జో అచుతానంద సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అలాగే హిందీలోనూ సినిమాచేసింది కానీ అదికూడా అంతగా ఆడలేదు.

అలాగే అడివిశేష్ ‘ఎవరు’ సినిమాలోనూ నెగెటివ్ రోల్ పోషించిందీ అందాల తార. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సెక్షన్ 108, జట్ కాకుండా, విదాముర్చి, ప్లాష్ బ్యాక్ వంటి చిత్రాల్లో నటిసస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ అలాగే , నేను ఓక సీరియల్ డేటర్ అని చెప్పేసింది. ఇక ఇప్పుడు బ్రేక్ తీసుకున్న అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




