Bobby Deol: మూగవాడిగా నటించి తన యాక్షన్‌తో భయపెట్టిన బాబీ దియోల్‌.!

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’లో మూగవాడిగా నటించి తన చేతలతోనే భయపెట్టిన నటుడు బాబీ దియోల్‌ . కనిపించేది కొద్దిసేపే అయినా అబ్రార్‌గా తన నటన, యాక్షన్‌తో అదరగొట్టాడు. అయితే, సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయినట్లు తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ దియోల్‌ మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ వంగా నుంచి ఒకరోజు మెసేజ్‌ వచ్చిందనీ,

Bobby Deol: మూగవాడిగా నటించి తన యాక్షన్‌తో భయపెట్టిన బాబీ దియోల్‌.!

|

Updated on: Sep 13, 2024 | 5:09 PM

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’లో మూగవాడిగా నటించి తన చేతలతోనే భయపెట్టిన నటుడు బాబీ దియోల్‌ . కనిపించేది కొద్దిసేపే అయినా అబ్రార్‌గా తన నటన, యాక్షన్‌తో అదరగొట్టాడు. అయితే, సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయినట్లు తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ దియోల్‌ మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ వంగా నుంచి ఒకరోజు మెసేజ్‌ వచ్చిందనీ, అది చూసి నిజంగా సందీప్‌ వంగానే మెసేజ్ చేశాడా? అనిపించిందని అన్నాడు. ఇద్దరం కలిసినప్పుడు సందీప్‌ తనతో పాటు ఒక ఫొటోను తీసుకొచ్చాడనీ అది సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో తాను పాల్గొన్నప్పటిదనీ బాబీ అన్నాడు. ఫొటోలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ కారణంగానే మిమ్మల్ని సినిమాలో అడుగుదామని వచ్చా అని సందీప్ వంగా అన్నాడట.

కథ చెప్పిన తర్వాత తనకు నచ్చిందనీ కొత్తగా ఏదైనా చేయాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందనీ అలాంటి సమయంలో ఈ కథ వచ్చిందనీ బాబీ దియోల్ అన్నాడు. తన పాత్రకు మాటలు రావని చెప్పాడనీ కానీ, సినిమాల్లో తన వాయిసే తనకు బలమనీ అయినా కూడా అతను చెప్పిన క్యారక్టరైజేషన్‌ నచ్చి, సినిమా చేయడానికి ఒప్పుకొన్నట్లు తెలిపాడు. రణ్‌బీర్‌కపూర్‌ ఉన్న సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టడంతో షూటింగ్‌ మొదలై నెలలు గడుస్తున్నా, తనను మాత్రం పిలవలేదనీ, దీంతో తనకు అనుమానం, భయం కలిగాయనీ, ఒకవేళ సందీప్ తన మనసు మార్చుకున్నాడేమో అనిపించిందని బాబీ దియోల్‌ చెప్పాడు. ఏదో ఒకరోజు సడెన్‌గా వచ్చి, తనను వద్దంటారేమో అనుకున్నాననీ అలా ఏడాదిన్నర పాటు అవే ఆలోచనలు తన మెదడులో తిరిగేవని అన్నాడు. కానీ, సినిమా విడుదలైన తర్వాత తన పాత్రకు మంచి పేరు వచ్చిందనన్నాడు. అంతేకాదు, మూవీ కల్ట్‌ హిట్‌ అవుతుందని అనుకోలేదని కామెంట్‌ చేశాడు. రణ్‌బీర్‌తో తన సన్నివేశాలు షూట్‌ చేసింది కేవలం 12రోజులు మాత్రమేననీ చెప్పాడు. చిన్నప్పటి నుంచి రణ్‌బీర్‌ తనకు తెలుసనీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నా కూడా తనకు మాత్రం రణబీర్‌, అలియా భట్‌ జోడీ అంటే ఇష్టం అని బాబీ దియోల్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us