AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangotri: అల్లు అర్జున్‌ గంగోత్రి సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా 2003లో రిలీజైంది. సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తుంటాయి.

Gangotri: అల్లు అర్జున్‌ గంగోత్రి సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. ఏం చేస్తుందో తెలుసా?
Gangotri Movie
Basha Shek
|

Updated on: Aug 11, 2024 | 7:27 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా 2003లో రిలీజైంది. సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తుంటాయి. ఇదే సూపర్ హిట్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అదితీ అగర్వాల్ . ఈమె మరెవరో కాదు దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు. గంగోత్రి సినిమాలో అదితీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆమె అందానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. తన సోదరి ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమయంలోనే అదితీ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. గంగోత్రి తర్వాత ఏం బాబూ లడ్డూ కావాలా, విద్యార్థి, కొడుకు సినిమాల్లో నటించింది. అయితే అక్కలా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. 2016లో చివరిసారిగా లవ్ హాయ్ యార్ అక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించిన అదితి ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

ఇక ఆర్తి అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఇండియాను విడిచి పెట్టి అమెరికాలో సెటిలైపోయింది అదితి అగర్వాల్. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటోందీ అందాల తార. అయితే ఇప్పటివరకు అదితి వివాహం చేసుకోలేదు. ఇదిలా ఉంటే అదితీ సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే గతేడాది తన ఫస్ట్ మూవీ హీరో అల్లు అర్జున్ ను ఓ సందర్భంలో కలుసుకుంది అదితీ అగర్వాల్. . బన్నీ న్యూయార్క్ వెకేషన్ కు వెళ్లినప్పుడు సరదాగా అతనిని కలిసిందీ అందాల తార. అప్పుడు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. అయితే గంగోత్రి సినిమాలో  అదితీకి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆమె బాగా మారిపోయింది. గంగోత్రి తర్వాత పలు సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం స్లిమ్ గా, నాజుకూగా మారినట్లు తెలుస్తోంది. అలాగే మరింత గ్లామరస్ గానూ కనిపించింది.  ప్రస్తుతం తన ఫ్యామిలీతోనే ఎక్కువగా సమయం గడుపుతోన్న అదితీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు,  నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి
Aditi Agarwal

Aditi Agarwal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.