AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీని మిస్ చేసుకుంది.. ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అయ్యింది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మానాన్నో తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కిక్‌ , శంభో శివ శంభో, బలుపు, పవర్‌, రాజా ది గ్రేట్‌ , క్రాక్‌ , వాల్తేర్‌ వీరయ్య లాంటి ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు.

రవితేజ సూపర్ హిట్ మూవీ వెంకీని మిస్ చేసుకుంది.. ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అయ్యింది
Venky
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2025 | 1:49 PM

Share

మాస్ మాహారాజా రవితేజకు ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్, మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీకి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇక రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్న సినిమాలు కమర్షియల్ హిట్ కాలేకపోయినా.. అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. రవితేజ చిత్రాలు ఏళ్లు గడిచినా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు తలచుకోగానే ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు తెప్పిస్తాయి. అందులో వెంకీ సినిమా ఒకటి. ఇందులోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆ ఎపిసోడ్ కు సంబంధించిన మీమ్స్ హంగామా అంతా ఇంతా కాదు..

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. నాగార్జున సాగర్‎కు వెళ్లి అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే అలవాటు తనకు వెంకీ సినిమాతోనే మొదలైందని అన్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల. అలాగే ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా ఆసిన్ ను అనుకున్నామని.. కానీ కుదరలేదన్నారు. ట్రైన్ సీన్స్ లో ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. ఈ సినిమాకు ముందుగా ట్రైన్ సీక్వెన్స్ వర్కౌట్ కాదేమోనని అందరూ సందేహించారని.. కానీ చివరకు ఆ సన్నివేశాలకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

వెంకీ సినిమా బాగుందని చిరంజీవి సర్ చెప్పడమే ఈ సినిమా విషయంలో తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని.. వెంకీ 2 తెరకెక్కించే ఆలోచన కూడా వచ్చిందని గతంలో చెప్పుకొచ్చారు. డైరెక్టర్ శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన వెంకీ సినిమాలో హీరోయిన్ గా స్నేహా నటించింది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, రామచంద్ర, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్  కీలకపాత్రలు పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?