Actress : శ్రీదేవికే చెమటలు పట్టించిన హీరోయిన్.. స్టార్ కిడ్తో ఎఫైర్.. 22 ఏళ్లకే సినిమాలకు దూరం.. ఎవరంటే..
సినీరంగంలో చాలా మంది తారలు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే తెలియక చేసిన చిన్న పొరపాట్లతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సినిమా ప్రపంచాన్ని ఏలిన హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ 22 ఏళ్ల వయసులోనే సినిమాలకు దూరమయ్యింది.

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో టాప్ హీరోయిన్లుగా దూసుకుపోయిన తారలలో ఆమె ఒకరు. 1981లో విడుదలైన లవ్ స్టోరీ సినిమాతో రాత్రికి రాత్రే సంచలనంగా మారింది. రాహుల్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్ర కుమార్ కుమారుడు కుమార్ గౌరవ్ పండిట్ హీరోగా నటించారు. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో విజయ్త పండిట్. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. 80లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చింది.
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె చేసిన చిన్న పొరపాటుతో కెరీర్ నాశనమైంది. దీంతో ఆమె ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యింది. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్త, కుమార్ గౌరవ్ ప్రేమలో పడ్డారు. కానీ వీరిద్దరి ప్రేమను గౌరవ్ తండ్రి రాజేంద్ర కుమార్ అంగీకరించలేదు. ఎందుకంటే కెరీర్ మొదట్లోనే తన తనయుడు ప్రేమలో పడడం అతడికి నచ్చలేదు.. ఆ తర్వాత నెమ్మదిగా విజయ్తకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
1985లో మొహబ్బత్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. దీంతో ఆమె సినిమాలకు దూరమయ్యింది. 1986లో చిత్ర నిర్మాత సమీర్ మల్కాన్ ను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి బంధం ఎక్కువకాలం సాగలేదు. ఆ తర్వాత 1990లో స్వరకర్త ఆదేశ్ శ్రీవాస్తవను వివాహం చేసుకున్న ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

Vijayta Pandit
ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..








