Sai Pallavi : ఆ స్టార్ హీరో అంటే పిచ్చి ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ అతడే.. సాయి పల్లవి..
చురల్ బ్యూటీ సాయి పల్లవి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. కోట్లాది అభిమానుల మనసు దొచుకున్న సాయి పల్లవి ఓ హీరోపై మనసు పారేసుకుందట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

దక్షిణాదిలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకు ముందు పలు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. తెలుగులో ఫిదా సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చివరగా తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ.. ఇప్పుడు హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఇందులో రణభీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రానికి మొత్తం రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా హిందీలో మరిన్ని అవకాశాలు అందుకుంటుంది సాయి పల్లవి.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి మాత్రం ఓ హీరోపై మనసు పారేసుకుందట. అతడే తన ఫస్ట్ క్రష్ అని.. ఆ హీరో అంటే ఎంతో ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ సాయి పల్లవి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. చాలా కాలం నుంచి ఈ హీరో అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
సూర్య, సాయి పల్లవి కలిసి ఎన్ జికే అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. అమరన్, తండేల్ సినిమాలతో సౌత్ లో వరుస హిట్స్ అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం కేవలం హిందీ చిత్రాల్లో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Suriya
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..




