Tollywood : ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరు ఇప్పుడే ఎంట్రీ..
ఇద్దరూ సెలబ్రెటీ కుటుంబాలకు చెందిన వారే. ఒకరు తోపు డైరెక్టర్ కూతురు కాగా.. మరొకరు స్టార్ హీరో గారాల పట్టి. సినీరంగంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ హీరోయిన్ తన ప్రాణ స్నేహితురాలి తెరంగేట్రం కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సౌత్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అమ్మాయి సెలబ్రెటీ ఫ్యామిలికీ చెందిన వారే. అందులో ఒకరు ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాగా..మరొకరు కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసా.. ? ఆ ఫోటో ఎడమ వైపు ఉన్న అమ్మాయి హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. కాగా కుడి పైపు ఉన్న అమ్మాయి స్టార్ హీరో మోహన్ లాల్ తనయ విస్మయ మోహన్ లాల్. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది కళ్యాణి ప్రియదర్శన్.తెలుగు, తమిళం, మలయాళంలో భాషలలో అనేక చిత్రాల్లో నటించిన కళ్యాణి.. ఇటీవల లోక చాప్టర్ 1 చంద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కళ్యాణి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీ ఇది.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మోహన్ లాల్ కూతురు విస్మయ సైతం సినీరంగంలోకి తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ఫస్ట్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే విస్మయకు శుభాకాంక్షలు తెలిపింది కళ్యాణి. అలాగే విస్మయతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తన బాల్యం ఎక్కువగా తన సోదరుడు మాయ, విస్మయతో గడిపానని.. చిన్నప్పుడు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, ఆటపట్టిస్తూ ఉండేవాళ్లమని గుర్తుచేసుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
View this post on Instagram
కళ్యాణి తెలుగులో హలో సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చిత్రాలహరి సినిమాలోని కనిపించింది. తెలుగులో కళ్యాణి నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ మలయాళంలో మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. గతంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తో కలిసి నటించిన హృదయం సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే లోక సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?




