AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ఆ హీరోయిన్‏కు లవర్‏గా, కొడుకుగా కనిపించిన నాగ చైతన్య.. ఇంతకీ ఆమె ఎవరంటే..

ప్రస్తుతం తండేల్ హిట్ జోష్ మీదున్నారు అక్కినేని నాగచైతన్య. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు చైతూ నటిస్తున్న సినిమాలపై మంచి హైప్ నెలకొంది. మరోవైపు ఓ టాలీవుడ్ హీరోయిన్ చైతూ కెరీర్ లో చాలా స్పెషల్ అని మీకు తెలుసా.. ? అవును.. ఆ హీరోయిన్ తో కలిసి మూడు విభిన్న పాత్రలు పోషించాడు.

Naga Chaitanya: ఆ హీరోయిన్‏కు లవర్‏గా, కొడుకుగా కనిపించిన నాగ చైతన్య.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 3:18 PM

Share

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఫాలోయింగ్ గురించి తెలిసిందే. జోష్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన చైతూ.. ఆ తర్వాత ఒక లైలా కోసం, శైలజ రెడ్డి అల్లుడు, దడ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో అలరించారు. ఇటీవలే డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో చైతూ సరసన మరోసారి సాయి పల్లవి కనిపించింది. దీంతో ఇప్పుడు చైతూ నటించనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలలుగా చైతూ కొత్త సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఓ టాలీవుడ్ హీరోయిన్.. చైతూ కెరీర్ లో చాలా స్పెషల్ అని మీకు తెలుసా.. ? అవును.. ఆ హీరోయిన్ తో కలిసి విభిన్న పాత్రలలో కనిపించాడు. ఆమెకు స్నేహితురాలిగా, ప్రేమికుడిగా, కొడుకుగా కనిపించాడు చైతూ. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి. వీరిద్దరు కలిసి మనం సినిమాలో కనిపించారు. ఆ చిత్రంలో చైతూ స్నేహితురాలిగా కనిపించింది లావణ్య. ఆ త్రవాత యుద్ధం శరణం సినిమాలో వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో చైతూ, లావణ్య లవర్స్ గా కనిపించారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ఆ తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ నటించిన బంగార్రాజు సినిమాలో లావణ్య త్రిపాఠి చైతూకు తల్లిగా నటించారు. ఇందులో నాగార్జున, లావణ్య దంపతుల కొడుకుగా చైతన్య కనిపించాడు. ఆ విధంగా ఒకే హీరోయిన్ కు కొడుకుగా లవర్ గా కనిపించారు చైతూ. కొన్నాళ్ల క్రితం లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె తల్లిగా ప్రమోషన్ పొందనుంది.

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

Naga Chaitanya, Lavanya

Naga Chaitanya, Lavanya

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..