Actress Saranya: ఈ నటి కూతుర్లు ఇద్దరూ ఫేమస్ డాక్టర్స్.. హీరోయిన్లను మించిన అందం.. ఫోటోస్ వైరల్..
దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని నటి శరణ్య. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోహీరోయిన్లకు తల్లి పాత్రలలో అద్భుతమైన నటనతో అలరించింది. కానీ ఆమె ఇద్దరూ కూతుర్లు మాత్రం ఫేమస్ డాక్టర్స్ అని మీకు తెలుసా..?
సౌత్ ఇండస్ట్రీలో అమ్మ, అత్త పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అందులో నటి శరణ్య ఒకరు. ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకన్ చిత్రంలో కథానాయికగా నటించింది శరణ్య. ఇందులో కమల్ హాసన్ సరసన అమాయకమైన యువతి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత సహాయ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది. వెండితెరపై అమ్మగా, అత్తగా తనదైన నటనతో అలరిస్తూ ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది శరణ్య. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే శరణ్య భర్త సైతం ఇండస్ట్రీలో చాలా ఫేమస్ నటుడు కావడం విశేషం. కోలీవుడ్ ఇండస్ట్రీలో శరణ్య భర్త పొన్వన్నన్ పాపులర్ డైరెక్టర్ కమ్ యాక్టర్.
నటి శరణ్య దంపతులు సౌత్ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అమ్మగా, అక్కగా, అత్తగా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది శరణ్య. ఇక ఆమె భర్త పొన్వన్నన్ సైతం తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి శరణ్య తన కుటుంబం గురించి అంతగా మాట్లాడారు. అలాగే ఆమె తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకోరు. శరణ్య దంపతుల పిల్లలు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఫేమస్ యాక్టర్స్ అయినప్పటికీ వీరి పిల్లలు మాత్రం ఇతర రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
శరణ్య, పొన్వన్నన్ దంపతులకు చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరు హీరోయిన్లను మించి అందంగా ఉంటారు. కానీ వీరు సినీరంగంలోకి కాకుండా వైద్య రంగంలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ డాక్టర్లుగా పట్టభద్రులు అయ్యారు. గతేడాది పెద్ద కూతురు చాందిని ఎంబీబీఎస్ పూర్తి చేయగా.. ఇప్పుడు రెండో కూతురు ప్రియదర్శిని సైతం శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శరణ్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.