Tollywood: 10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే..
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. కానీ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఆ అమ్మడు రెమ్యునరేషన్ తెలిసి షాకవుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం సౌత్ సినిమాపై దృష్టి సారించింది. ముఖ్యంగా కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు చేయడానికి ఇతర భాష నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లో చిన్న ఛాన్స్ వచ్చినా నటించేందుకు సిద్ధమంటున్నారు పలువురు హీరోయిన్స్. కానీ అంతకు మించి భారీగా పారితోషికం సైతం వసూలు చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. తెలుగులో చేసింది ఒక్క సినిమానే. కానీ పది రోజుల షూటింగ్ కోసం ఏకంగా రూ.9 కోట్ల రెమ్యునరేషన్ వసూలు చేసిందట. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అలియా భట్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని కథానాయిక.
బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న అలియా.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. అదే ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇందులో సీత పాత్రలో అద్భుతంగా నటించింది అలియా.
అయితే ఈ సినిమాకు కేవలం పది రోజులు మాత్రమే వర్క్ చేసిందట. అయితే పది రోజులు షూటింగ్ చేసినందుకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం తీసుకుందట. ఈ సినిమాలో తనదైన నటనతో మెప్పించిన అలియా.. మరో తెలుగు మూవీ చేయలేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.