నా అందం సీక్రెట్ ఇదే.. ఉదయాన్నే ముఖంపై ఉమ్మి రాస్తా.. స్టార్ హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది.
ఇన్నాళ్లు తెలుగులో చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. గ్లామర్ లుక్స్, క్రేజీ డ్యాన్స్ స్టెప్పులతో కట్టిపడేస్తుంది.
కేవలం మూడు నిమిషాల పాటకు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తూ.. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది తమన్నా
తాజాగా తన అందానికి సీక్రెట్ రివీల్ చేసింది. తన ముఖంపై మొటిమలు రాకుండా ఉండేందుకు తన లాలాజలాన్ని ఉపయోగిస్తానని తెలిపింది.
నేను నా మొటిమలకు లాలాజలం రాసి వాటిని సరిచేస్తాను. మీరు ఉదయం మీ నోటి నుండి లాలాజలాన్ని ఉపయోగించాలని చెప్పుకొచ్చింది తమన్నా.
శాస్త్రీయంగా ఉదయం నోటిలోని లాలాజలం ఎక్కువ యాంటీ బాక్టీరియల్ అని.. ఇది మొటిమలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపింది ఈ అమ్మడు.
దీంతో ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే అందానికి ఆహారపు అలవాట్లు సైతం ముఖ్యమని తెలిపింది.
చర్మాన్ని ప్రభావితం చేసే ఆహార పదార్థాలేవీ తీసుకోనని.. గ్లూటెన్, బార్లీతోపాటు పాల ఉత్పత్తులకు సైతం తనకు అలర్జీ ఉందని చెప్పుకొచ్చింది.