AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ సేన్ రియాక్షన్ వైరల్.. వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vishwak Sen: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ సేన్ రియాక్షన్ వైరల్.. వీడియో
Ram Charan, Vishwak Sen
Basha Shek
|

Updated on: Dec 19, 2025 | 8:34 PM

Share

సోషల్ మీడియా వచ్చాక మాటకు అదుపు ఉండడం లేదు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. ముఖ్యంగా సినిమాలు, సినిమా తారలు చాలా మందికి ఈజీ టార్గెట్ అయిపోయారు. సెలబ్రిటీల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇక రివ్యూల సంగతి సరేసరి.. ఎవరు పడితే వారు సినిమాలకు సమీక్షలు, రేటింగులు ఇస్తున్నారు. తమ యూట్యూబ్‌ ఛానెల్ వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్లు సినిమాలపై కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ది సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రామ్ చరణ్ నటిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి కొందరు యూట్యూబర్లు నీచమైన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియోలో పూల చొక్కా నవీన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? అని అడిగితే మరొకరు నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్‌ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ అవహేళన చేస్తూ మాట్లాడాడు.

ప్రస్తుతం పెద్ది మూవీ గురించి కొందరు యూట్యూబర్లు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగాభిమానులు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్‌ ఈ వీడియోపై స్పందించాడు. తనదైన స్టైల్ లో యూట్యూబర్లకు ఇచ్చి పడేశాడు. ‘ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రయోజనం పొందుతూ చివరికి వారినే కించపరిచేలా కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి వాళ్లను పరాన్నజీవులు అని పిలవడం సమంజసం కదా? సినిమా ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్‌ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉంది’ అని విశ్వక్ సేన్‌ మండిపడ్డారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి