AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి మాటెత్తని అందాల తారలు చాలా మందే ఉన్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ తార 50 ఏళ్లొచ్చినా సింగిల్ గానే ఉంది.

Tollywood:పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Dec 27, 2024 | 3:49 PM

Share

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? 90 వదశకంలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ గ్లామరస్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఈ అందాల తార క్రేజ్ ను చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే వారు. తన అందం, అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది. పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపిందంటూ ఈ బ్యూటీపై రూమర్లు వినిపించాయి. ఇక టీమిండియా దిగ్గజ క్రికెటర్ తోనూ రిలేషన్ నడిపిందని ప్రచారం జరిగింది. ఇవి నిజమో, అబద్ధమో తెలియదు కానీ 50 ఏళ్లు వచ్చినప్పటికీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. తను మరెవరో కాదు నగ్మా. శుక్రవారం (డిసెంబర్ 27) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో నగ్మా చిన్ననాటి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇతర రంగాలతో పోలిస్తే సినిమా సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది. అదే సమయంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్ర రావు చెప్పినట్లు ‘అరేబియన్ గుర్రమంటి నలక నడుమున్న నగ్మా’ తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్‌ కుమార్‌, మనోజ్‌ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతోనూ లవ్‌లో పడిందని ప్రచారం సాగింది. అయితే ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటితో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. అయితే కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నగ్మా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కాగా సినిమాలకు దూరంగా ఉంటోన్న నగ్మా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలిగా ఉన్న ఆమె మీరట్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్