AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఆమెతో కలిసి వంట చేయడం చాలా ఇష్టమట..

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి హీరో వెంకటేశ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ఎఫ్ 2, ఎప్ 3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుంది. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Venkatesh: వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఆమెతో కలిసి వంట చేయడం చాలా ఇష్టమట..
Balakrishna, Venkatesh
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2024 | 3:36 PM

Share

హీరో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇదివరకు రెండు సూపర్ హిట్ సాంగ్స్ రిలీజ్ కాగా.. ఇప్పుడు త్వరలోనే మూడో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి వస్తున్నాం మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు వెంకటేశ్. బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న ఈ టాక్ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, సురేష్ బాబు, వెంకటేశ్ సందడి చేశారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అలాగే తన సతీమణి నీరజ గురించి వెంకీమామ మాట్లాడారు.

ఈ షోలో బాలయ్య మాట్లాడుతూ.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? అని అడగ్గా.. వెంకటేశ్ స్పందిస్తూ.. “నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నీరజ. తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు. ఏమాత్రం సమయం దొరికినా తన భార్యతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఇద్దరం కలిసి టూర్స్ వెళ్తాం. ఆమెతో కలిసి అప్పుడప్పుడు వంట చేయడం నాకు చాలా ఇష్టం” అని అన్నారు. అలాగే రానా చిన్నతనంలో ఎంతో సైలెంట్ గా ఉండేవాడని అన్నారు. “నా బెడ్ కింద్ దూరి సూపర్ హీరోల పాత్రల బొమ్మలతో ఆడుకుంటూ ఉండేవాడు” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తనకు క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని వెంకటేష్ చెప్పారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్, ధోనీని కలవడం గురించి ప్రస్తావించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీని అభినందించేందుకు వెళ్లిన సమయంలో ధోని చేసిన పని చూసి షాకయ్యానని అన్నారు. ధోని చేసిన పని గురించి వెంకీమామ ఏం చెప్పాడో తెలియాలంటే డిసెంబర్ 27న ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ ఏడవ ఏపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో