AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All We Imagine As Light OTT: ఓటీటీలోకి ఒబామా మెచ్చిన సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మనసు గెలుచుకున్న ఇండియన్ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 2024లో తనకు ఎక్కువగా నచ్చిన సినిమా ఇదే అంటూ సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో ఆ సినిమా పేరు తెగ మారుమోగింది. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

All We Imagine As Light OTT: ఓటీటీలోకి ఒబామా మెచ్చిన సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
All We Imagine As Light
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2024 | 5:16 PM

Share

డైరెక్టర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన సినిమా ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light)’. కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విభిన్నమైన కథతో డ్రామా ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమా కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై గ్రాండ్ పిక్స్ అవార్డును అందుకుంది. అంతేకాకుండా గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సైతం నామినేట్ అయ్యింది. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో టాలీవుడ్ హీరో, ప్రొడ్యూసర్ రానా విడుదల చేశారు. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రదర్శితమైన విమర్శకులు, హాలీవుడ్ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light)’ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ముంబయి నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ (All We Imagine as Light)’. ఇద్దరు కలిసి ఓ బీచ్ టౌన్ కు రోడ్ ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా మారాయి.. ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రానికి అంతర్జాతీయ పబ్లికేషన్లలో మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఎన్నో అవార్డులను గెలుచుకుంది.

ఇక ఈ సినిమాపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ప్రశంసలు కురించారు. ఈ ఏడాది తన మనసు గెలుచుకున్న ఇండియన్ చిత్రాల్లో ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ ఒకటి అని అన్నారు. దీంతో ఈ సినిమమా గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేశారు. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.