AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnudu: నటుడు కృష్ణుడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.. ఏకంగా కాటన్ దొరతో..

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో కృష్ణుడు కూడా ఒకరు. దీని తర్వాత పలు సినిమాల్లో హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా కృష్ణుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు

Krishnudu: నటుడు కృష్ణుడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.. ఏకంగా కాటన్ దొరతో..
Krishnudu Family
Basha Shek
|

Updated on: Nov 08, 2024 | 12:45 PM

Share

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు కృష్ణుడు. ముఖ్యంగా వినాయకుడు సినిమాలో హీరోగా అతని అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పదుల సినిమాల్లో నటించిన కృష్ణుడు ఆ మధ్యన పొలిటికల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ రెండింటికీ దూరంగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2019 లో రిలీజైన హల్ చల్ అనే సినిమాలో చివరిసారిగా నటించాడు కృష్ణుడు. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. ఆ మధ్యన తన భార్య గాయత్రి పేరు మీద ఒక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. సుమారు ఐదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృష్ణుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.అ అది కూడా రామ్ చరణ్, రజనీకాంత్ సినిమాలతో. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడీ యాక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృష్ణుడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘మాది రాయల్ ఫ్యామిలీ కాదు.. కానీ డబ్బుకి ఏ మాత్రం లోటు. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లోని రాజోలు. ఇక మా తాతయ్య కాటన్ దొరతో చాలా సన్నిహితంగా ఉండేవారు. రాజోలు ప్రాంతంలో కాటన్ దొరతో కలిసి మా తాతయ్యే కాలువలను దగ్గరుండీ తవ్వించాడు. అలాగనీ మా తాతయ్య ఇంజనీర్ కాదు.. కానీ కాలువల నిర్మాణం, కట్టడంపైనా అవగాహనా , మంచి పట్టు ఉండేది. గన్నవరం నుంచి అంతర్వేది వరకు ఆయన వేయించిన కాలువలే ఇప్పటికీ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు కృష్ణుడు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయం గురించి మాట్లాడుతూ.. ‘ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. అప్పట్లోనే సినిమాల్లో ట్రై చేయి.. ఉన్నత స్థాయికి చేరుతావు అంటూ ఎంతోమంది ఎంకరేజ్ చేశారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ ఇక్కడ కొత్తగా ఏదీ లేదనిపించి ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఇప్పుడు మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి’ అని తెలిపాడు కృష్ణుడు.

భార్య, కూతురుతో కృష్ణుడు..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us