KA: పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న “క”
ఈ దీపావళి సౌత్ సినిమాకు బాగా కలిసొంచ్చింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలకు హిట్ టాక్ రావటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా క మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న ఈ మూవీ టీమ్... దీపావళి రోజు కేవలం తెలుగులోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు సక్సెస్ జోష్‌లో పాన్ ఇండియా రిలీజ్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు.
Updated on: Nov 08, 2024 | 12:45 PM

ఈ దీపావళి సౌత్ సినిమాకు బాగా కలిసొంచ్చింది. రిలీజ్ అయిన అన్ని సినిమాలకు హిట్ టాక్ రావటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా క మూవీ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న ఈ మూవీ టీమ్... దీపావళి రోజు కేవలం తెలుగులోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు సక్సెస్ జోష్‌లో పాన్ ఇండియా రిలీజ్‌కు గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు.

కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. దీపావళి సందర్భంగా భారీ కాంపిటీషన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ కోసమే సిద్ధం చేశారు మేకర్స్. కానీ మలయాళంలో దుల్కర్ సినిమా బరిలో ఉండటం, తమిళనాట అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవటం... ఇలా రకరకాల కారణాలతో దీపావళికి తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యింది క.

ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ రావటంతో పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు క మేకర్స్. నవంబర్ 15న మలయాళంలో రిలీజ్ చేసి, ఆ తరువాత నవంబర్ 22న తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజెంట్ తెలుగు స్టేట్స్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్న క, అదర్ లాంగ్వేజెస్‌లోనూ అదే రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్. మరి నిజంగానే కిరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.