AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone : దీపికా చెల్లెల్ని చూశారా..? అందంలో అక్కకు పోటీ.. సినిమాలకు దూరంగా.. ఫేమస్ ప్లేయర్.. 

దీపికా పదుకొణె.. ప్రస్తుతం వార్తలలో ఎక్కువగా నిలుస్తున్న పేరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ఆత్మ విశ్వాసంతో సినీరంగంలో రాణిస్తుంది. అయితే ఇప్పుడు దీపికా చెల్లెలి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆమె దీపిక కంటే చాలా భిన్నమైన జీవితాన్ని గడుపుతుంది.

Deepika Padukone : దీపికా చెల్లెల్ని చూశారా..? అందంలో అక్కకు పోటీ.. సినిమాలకు దూరంగా.. ఫేమస్ ప్లేయర్.. 
Deepika Padukone
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 9:52 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో దీపిక పదుకొణె ఒకరు. అంతేకాదు.. సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కూడా ఈ బ్యూటీ ముందుంటుంది. హిందీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. అలాగే ఇటీవల భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ నుంచి దీపిక తప్పుకోవడం.. 8 గంటలు పని చేయాలనే షరతుతోపాటు అనేక కండీషన్స్ పెట్టడంతోనే ఆమెను సినిమాల నుంచి తొలగించారనే టాక్ నడుస్తుంది. కొందరు దీపికకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శిస్తున్నాయి. అయితే తన గురించి వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది దీపికా. ఇదిలా ఉంటే.. దీపిక చెల్లెలి గురించి తెలుసా.. ? ఇప్పుడు ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది.

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

దీపిక పదుకొణె చెల్లెలి పేరు అనిషా పదుకొణె. వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉంటారు. అనిషా పదుకొనే దీపిక కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అనిషా దీపికతో చాలాసార్లు కనిపించింది. కానీ ఆమె కెమెరాకు చాలా దూరంగా ఉంటుంది. దీపిక, అనిషాల మధ్య ఐదేళ్ల వయసు వ్యత్సాసం ఉంది. ఇద్దరూ తమ బాల్యాన్ని బెంగళూరులోనే గడిపారు. అనిషా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో చదువుకుంది. అనిషా తన తండ్రిలాగే బాలీవుడ్‌కు దూరంగా క్రీడల్లో కెరీర్‌ను ఎంచుకుంది. దీపిక, అనిషాల తండ్రి ప్రకాష్ పదుకొనే మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. అనిషా గోల్ఫ్ క్రీడాకారిణి. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, అనిషా చాలా సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

గోల్ఫ్ కాకుండా, ఆమెకు హాకీ, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ అంటే తనకు ఇష్టమని ఇదివరకు అనిషా చెప్పుకొచ్చింది. ఆమె 12 సంవత్సరాల వయస్సు నుండి గోల్ఫ్ ఆడుతున్నారు. అనిషా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె 2015 లో స్థాపించబడిన ‘లైవ్ లవ్ లాఫ్’ అనే ఛారిటబుల్ ట్రస్ట్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సోషల్ మీడియాలో, ఆమె ఫిట్నెస్ ప్రయాణాన్ని పంచుకుంటుంది. తన ట్రస్ట్ ద్వారా డిప్రెషన్, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తుంది. ట్రస్ట్ ద్వారా, ఆమె దేశ విదేశాలలో వివిధ అంశాలపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..