Jabardasth Naresh : ఓ ఇంటివాడు కాబోతున్న జబర్దస్త్ నరేష్.. వధువు ఎవరంటే..?
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో నరేష్ పెళ్లి సందడి బాగా హైలెట్ అయింది. అమ్మాయిని తీసుకొని స్టేజ్ మీదే నరేశ్‌కు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నవ్య అనే అమ్మాయి ఈ పెళ్లి చూపులకు వచ్చింది. ఆ ఎపిసోడ్ ప్రోమోపై ఓ లుక్ వేద్దాం పదండి...

శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్‌పై మళ్లీ పెళ్లి వాతావరణం నెలకొంది. గతంలో ఇదే స్టేజ్ మీద రష్మీ-సుధీర్‌లకు సరదాగా చేసిన పెళ్లి ఎంత హల్‌చల్ చేసిందో గుర్తుందా?. ఆ తర్వాత అదో ఉత్తుత్తి పెళ్లి అని తేల్చేశారు. తాజాగా ఈసారి పెళ్లి చూపుల వ్యవహారం సెట్ అయింది. ఈ సారి వరుడు జబర్దస్త్ కమెడియన్ నరేష్!. స్టేజ్ మీద హైపర్ ఆది ఓ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘మా అందరికీ ఒక ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది. నరేష్‌ను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాళ్లు కూడా ఇక్కడికే వచ్చారు!’ అని ఆది చెప్పడంతో స్టేజ్ ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోయింది. ఆ తర్వాత అమ్మాయిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి, లైవ్ పెళ్లి చూపులు మొదలుపెట్టారు. నవ్య–నరేష్ పేర్లు కలుస్తున్నాయి అంటూ ఆది నవ్వులు పూయించాడు.
ఆ సమయంలో ఆ అమ్మాయి నరేష్ వైపు తిరిగి..’నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చా. లవ్ యూ… లవ్ యూ ఫరెవర్!” అని ప్రపోజ్ చేసింది. సిగ్గుతో తల వంచిన నరేష్ కూడా తడుముకోకుండా.. ‘నాకు కూడా మీరు బాగా నచ్చారు’ అని సమాధానం ఇచ్చాడు. అంతలో“ఏమ్మా! నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తావా?” అని అన్నపూర్ణమ్మ సరదాగా అడిగింది. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ.. “నరేష్‌కి ఏది ఇష్టమైతే, అదే నాకూ ఇష్టం!” అని బదులిచ్చింది.
ఈ సరదా పెళ్లి వాతావరణంలో నరేష్ తండ్రి కాస్త ఎమోషనల్ అయ్యారు. “నా కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీన్ చూసి నాకు నిజంగా ఆనందంగా ఉంది” అని చెప్పడంతో స్టేజ్ ఎమోషనల్ మోడ్‌లోకి వెళ్లింది. హాస్యం, హృదయాన్ని తాకే ఎమోషన్.. రెండూ కలిసిన ఈ ఎపిసోడ్ నరేష్ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మారిపోయింది. మరి ఇవి ఉత్తుత్తి పెళ్లి చూపులా..? లేదా నిజంగానే పెళ్లి చూపులు ఇలా ప్లాన్ చేశారా అనేది చూడాలి.




