AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : రాజకుటుంబంలో పుట్టిన అమ్మాయి.. హాకీ ప్లేయర్.. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. ఇప్పుడేం చేస్తుందంటే..

రాజకుటుంబంలో జన్మించిన ఈ యువరాణికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం, తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్ తో సినిమా చేయడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్క సినిమాతోనే ఆమె పేరు మారుమోగింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ క్రికెటర్ తో ప్రేమలో పడి గ్లామర్ ప్రపంచం నుంచి దూరమైంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Actress : రాజకుటుంబంలో పుట్టిన అమ్మాయి.. హాకీ ప్లేయర్.. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Sagarika Ghatge
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 9:29 PM

Share

సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందరూ అక్కడ విజయం సాధించరు. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాని తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అమ్మాయి రాజకుటుంబంలో జన్మించింది. తన అందం, అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఎక్కవగా ఆసక్తి చూపించిన అమ్మాయి.. ఫేమస్ హాకీ ప్లేయర్. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే కింగ్ షారుఖ్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ మూవీకే అద్భుతమైన నటన అంటూ ప్రశంసలు అందుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ఒక క్రికెటర్‌తో ప్రేమలో పడడం .. ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్లో వారి ప్రేమ, డేటింగ్ హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరు ? ఇప్పుడేం చేస్తుంది ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. “చక్ దే ఇండియా” సినిమాలోని ప్రముఖ నటి సాగరిక ఘాట్గే. ఈ సినిమాలో, సాగరిక షారుఖ్ ఖాన్ తో కలిసి నటించింది. మొదటి సినిమాలోనే తన నటన, అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమెను హాకీ క్రీడాకారిణిగా చూపించారు. కానీ నిజ జీవితంలో కూడా జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఆమెకు ఈ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. సాగరిక రాజకుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి విజయ్ సింగ్ ఘట్గే కాగల్ రాజకుటుంబానికి రాజు. 2017లో, సాగరిక స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

వీరిద్దరు కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు. అప్పట్లో వారి ప్రేమకథ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ ప్రపంచానికి దూరమైంది. చక్ దే ఇండియా తర్వాత, సాగరిక “మిలే నా మిలే హమ్,” “ఫాక్స్,” “రష్” వంటి చిత్రాలలో నటించింది. హిందీతో పాటు, ఆమె మరాఠీ, పంజాబీ చిత్రాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె చివరి చిత్రం “ఇరాదా” 2017లో విడుదలైంది. చాలా కాలం విరామం తర్వాత సాగరిక 2020లో “ఫుట్‌ఫెరి”తో OTT ప్లాట్‌ఫామ్‌కు తిరిగి వచ్చింది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..