AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ మరో కొత్త ప్రపంచం.. డార్లింగ్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్ చెప్పిన డైరెక్టర్..

తాజాగా ప్రాజెక్ట్ కె అలస్యం కావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఇది సాధారణ సినిమా కాదని.. ఇప్పటివరకు ఇలాంటి చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడలేదన్నారు.

Prabhas: 'ప్రాజెక్ట్ కె' మరో కొత్త ప్రపంచం..  డార్లింగ్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్ చెప్పిన డైరెక్టర్..
Project K
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2022 | 11:06 AM

Share

మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపుకు తిప్పుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితాన్ని ఈతరం సినీ ప్రియులకు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే పై సామాన్యులే కాకుండా సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సావిత్రి జీవితంలోని సుఖదుఃఖాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు సినిమా పై స్పష్టత రాలేదు. దీంతో ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం ట్విట్టర్ వేదికగా చిత్రబృందానికి మొరపెట్టుకుంటున్నారు డార్లింగ్ అభిమానులు. అయితే తాజాగా ప్రాజెక్ట్ కె అలస్యం కావడంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఇది సాధారణ సినిమా కాదని.. ఇప్పటివరకు ఇలాంటి చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడలేదన్నారు.

ఇది చాలా కొత్త సినిమా.. అలాగే స్క్రిప్ట్ కూడా కొత్తది. ఇది ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచం.. టెక్నీషియన్స్ అంతా కొత్తగా ఉంటాయి. ఒకరకంగా ఈ సినిమా ఎలా చేయాలని ఆలోచించడానికే చాలా సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారు చేయాలి. మహానటి సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం.. కానీ ఈ చిత్రానికి అలా కుదరదు. అన్నీ మేమే తయారు చేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా సినిమా కొత్తగా అయితే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.

ఇవి కూడా చదవండి

ఇక డైరెక్టర్ మాటలతో మూవీపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. సినిమా నిర్మాణానికి కావాల్సిన ప్రతి వస్తువు తయారు చేసుకోవాలంటే. . సినిమా ఏ రెంజ్ లో ఉండనుందనేది అర్థమవుతుంది. ఈ చిత్రం కోసం కెమికల్ ఇంజినీర్లు.. కొత్త టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి