Balakrishna: తెలంగాణ యాసలో స్పీచ్ అదరగొట్టిన బాలయ్య.. దాస్ కా ధమ్కీ ఈవెంట్లో నందమూరి నటసింహం రచ్చ..
యాంకర్ గీత నుంచి మైక్ అందుకున్న బాలయ్య.. దాన్ని గాలిలోకి గిరా గిరా ఎగరేసి పట్టుకున్నారు. దీంతో అభిమానులు ఈలలు వేస్తూ గోల చే శారు. అరే బయ్ మొత్తం నువ్వే మాట్లాడేసినవ్..
యంగ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ అందించారు. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ సినిమా దాస్ కా ధమ్కీ. తాజాగా విడుదలైన ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై క్యూరియాసిటిని పెంచేసింది. ఫస్ట్ లుక్ లో విశ్వక్ ఇంటెన్స్ అవతార్లో కనిపించాడు. శుక్రవారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు. ముందుగా యాంకర్ గీత నుంచి మైక్ అందుకున్న బాలయ్య.. దాన్ని గాలిలోకి గిరా గిరా ఎగరేసి పట్టుకున్నారు. దీంతో అభిమానులు ఈలలు వేస్తూ గోల చే శారు. అరే బయ్ మొత్తం నువ్వే మాట్లాడేసినవ్.. నేనేం మాట్లాడను.. అంటూ తెలంగాణ యాసలో స్పీ్చ్ స్టార్ట్ చేశారు. అనంతరం గుక్క తిప్పుకోకుండా సరస్వతీ నమస్తుభ్యం స్తాత్రాన్ని చెప్పేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య విశ్వక్ పై ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ గురించి మాట్లాడుతూ.. నీ ఇంట్లో నా ఇంజిను అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ చెప్పి రచ్చ చేశారు
అలాగే విశ్వక్ తండ్రి కరాటే రాజు గురించి మాట్లాడుతూ.. తంబి విశ్వక్ సేన్ వాళ్ల నాన్న మాట్లాడినప్పుడు ఆయన ఎత్తుకోవడమే ధమ్కీ లాగా ఎత్తిండు.. ఆ తర్వాత మైకులు పనిచేయవేమో.. నేను మాట్లాడలేనేమో అనుకున్నా అంటూ పంచ్ వేశారు. అనంతరం.. దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ చాలా అద్భుతంగా కన్నుల విందుగా వుంది. విశ్వక్ సేన్ కి నా అభినందనలు. డీవోపీ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. యష్ మాస్టర్ అద్భుతమైన స్టెప్స్ వేయించారు. మంచి సాహిత్యం కూడా వుంది. సినిమా అంటే విశ్వక్ కి చాలా ప్యాషన్. ఈ సినిమా చూస్తే విశ్వక్ ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. ఎన్నో ఒడిదుడుగులు దాటి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని కొత్తదనంని ఎప్పుడూ ఆదరిస్తారు.
ఫలక్ నామా దాస్, అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా ఇలా వైవిధ్యమైన సినిమాలతో అలరించి ఇప్పుడు దాస్ కా ధమ్కి తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాకి నటనతో పాటు దర్శకత్వం నిర్మాణం చేయడం కూడా చాలా అరుదైన విషయం. అన్నీ తానై, తన టీంకి స్ఫూర్తిని ఇచ్చారు విశ్వక్ సేన్. ఇలాంటి సినిమాలు చూస్తున్నపుడు నన్ను నేను ఊహించుకుంటాను. ‘దాస్ కా ధమ్కీ’ థియేటర్ లో చూడాల్సిన సినిమా. దర్శకుడిగా అద్భుతంగా తీశారు విశ్వక్. టీం అందరికీ నా అభినందనలు. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా వందరోజుల వేడుకకి కూడా నేను రావాలి” అని కోరుకున్నారు