Nithya Menen: ప్రెగ్నెన్సీపై ఆసక్తికర పోస్ట్ చేసిన నిత్యా మీనన్.. బేబీ బంప్ ఫోటోలతో అసలు విషయం చెప్పేసింది..

ఇటీవల ప్రెగ్నె్న్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ ఆ ? అంటూ అనేక సందేహలు వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేయడంతో.. తన తదుపరి ప్రాజెక్ట్స్ ప్రచారంలో భాగంగానే ఇలా ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ షేర్ చేస్తున్నట్లుగా తెలిసిందే. తాజాగా మరోసారి

Nithya Menen: ప్రెగ్నెన్సీపై ఆసక్తికర పోస్ట్ చేసిన నిత్యా మీనన్.. బేబీ బంప్ ఫోటోలతో అసలు విషయం చెప్పేసింది..
Nithya Menen
Follow us

|

Updated on: Nov 19, 2022 | 7:23 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో నిత్యామీనన్ స్థానం ప్రత్యేకం. హీరోయిన్ పాత్ర ప్రాధాన్యత .. కంటెంట్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఎంచుకుంటుంది. ఈ ఏడాది స్కైలాబ్, భీమ్లానాయక్ వంటి చిత్రాలతో అలరించిన నిత్యా.. గత కొద్ది రోజులుగా తన ఇన్ స్టా ఖాతాలో షాకింగ్ పోస్టులు షేర్ చేస్తుంది. ఇటీవల ప్రెగ్నె్న్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ ఆ ? అంటూ అనేక సందేహలు వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వీడియో షేర్ చేయడంతో.. తన తదుపరి ప్రాజెక్ట్స్ ప్రచారంలో భాగంగానే ఇలా ఇంట్రెస్టింగ్ పోస్ట్స్ షేర్ చేస్తున్నట్లుగా తెలిసిందే. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ప్రెగ్నెన్సీ ఎప్పుడూ అందంగా కనిపించడంలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పుడు నిత్యా వండర ఉమెన్ వెబ్ సిరీస్‏లో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నిత్యాతోపాటు..తమిళ్ హీరోయిన్ పార్వతి తిరువోతు కూడా నటిస్తోంది. ఈ సిరీస్ కు అంజలి మీనన్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీ లైవ్ లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్ ను రోనీ స్క్రూ వాలా.. ఆషి దువా సారా నిర్మించగా.. ఇందులో నదియా, పద్మప్రియ కీలకపాత్రలలో నటించారు. నిత్యా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.