RX 100 Movie: ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాకు కార్తికేయ ఫస్ట్ ఛాయిస్ కాదా! ఆ స్టార్ హీరోలు రిజెక్ట్ చేయడంతోనే..
సుమారు ఏడేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ బోల్డ్ లవ్ క్రైమ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకుఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది.

యంగ్ హీరో కార్తికేయ ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా ఆర్ ఎక్స్ 100. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించింది. రావు రమేష్, రాంకీ, లక్ష్మణ్ మీసాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2018లో విడుదలైన ఆర్ ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూసేశారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, పాయల్ గ్లామర్, కార్తికేయ నటన, ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఆర్ ఎక్స్ 100 సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. హీరో కార్తికేయ, డైరెక్టర్ అజయ్ భూపతిలకు ఇదే మొదటి సినిమా కాగా, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు మొదటి తెలుగు సినిమా. ఇలా ఈ ముగ్గురికీ ఆర్ ఎక్స్ 100 మంచి బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా హీరో కార్తికేయకు మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. దీని తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడీ యంగ్ హీరో. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమాకు హీరో కార్తికేయ మొదటి ఛాయిస్ కాదట. అతని కన్నా ముందు చాలా మంది హీరోల దగ్గరకు ఈ కథ వెళ్లిందట. అయితే వివిధ కారణాలతో వారు రిజెక్ట్ చేయడంతో చివరికి కార్తికేయ దగ్గరకు వచ్చిందట.
‘ఆర్.ఎక్స్.100’ సినిమాను మొదట శర్వానంద్ తో చేయాలని దర్శకుడు అజయ్ భూపతి భావించాడట. అయితే ఎందుకో గానీ శర్వా ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. ఆతర్వాత నవీన్ చంద్రకు కూడా ఇదే కథ చెప్పాడట. కానీ అతను కూడా నో చెప్పాడట. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ దగ్గరకు కూడా ఆర్ ఎక్స్ 100 కథ వెళ్లిందట. అయితే వీరందరూ వివిధ కారణాలతో నో చెప్పారట. దీంతో ఫైనల్ గా కార్తికేయని పెట్టి సినిమా తీశారట అజయ్ భూపతి.
కాగా ఆర్ ఎక్స్ 100 తర్వాత శర్వానంద్ తో మహా సముద్రం సినిమా తీశాడు అజయ్ భూపతి. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే తన మొదటి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో తీసిన మంగళవారం మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
శర్వానంద్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








