AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి ఎందుకు ఎక్కువగా కుర్తాల్లోనే కనిపిస్తాడో తెలుసా? దీని వెనక ఇంత కహానీ ఉందా?

సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించి క్రేజ్ ఉన్న టాలీవుడ్ డైరెక్టర్. ఇప్పటవరకు తీసింది కేవలం 3 సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సందీప్.

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి ఎందుకు ఎక్కువగా కుర్తాల్లోనే కనిపిస్తాడో తెలుసా? దీని వెనక ఇంత కహానీ ఉందా?
Sandeep Reddy Vanga
Basha Shek
|

Updated on: Oct 09, 2025 | 5:42 PM

Share

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు నాట సెన్సేషన్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఆర్జీవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో సెన్సేషనల్ డైరెక్టర్ వచ్చాడన్న మాటలు వినిపించాయి. ఈ మాటలను నిజం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. బాలీవుడ్ లోనూ గట్టిగా జెండా పాతేశాడు. ఇక చాక్లెట్ బాయ్ లాంటి రణ్ బీర్ కపూర్ ను ‘యానిమల్’ గా చూపించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేశాడు సందీప్ రెడ్డి. సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తాడని, హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటుందని విమర్శలు వచ్చినా ఇప్పుడు సందీప్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. ఇక స్పిరిట్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను వద్దనడం ఈ డ్యాషింగ్ డైరెక్టర్ కే చెల్లింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈ డైరెక్టర్ సొంతం. సినిమాలు, కాంట్రవర్సీల సంగతి పక్కన పెడితే.. సందీప్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సందర్భమేదైనా ఎక్కువగా కుర్తాలతోనే కనిపిస్తాడీ సెన్సేషనల్ డైరెక్టర్. సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లు, ఇంటర్వ్యూల్లోనూ రంగురంగులు కుర్తాలనే హాజరవుతుంటాడు సందీప్. అరుదుగా మాత్రమే జీన్స్, టీ షర్ట్స్ లో కనిపిస్తాడు.

సినిమాల్లోకి రాక ముందు సందీప్ రెడ్డి నాగార్జున కేడీ సినిమాకు పని చేశాడు. నాగార్జున నటించిన ఈ మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించాడీ డైరెక్టర్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కేడీ తర్వాత ఇంకో సినిమాలో పని చేయకూడదనుకున్నాడు సందీప్ . కేవలం డైరెక్షన్ మాత్రమే చేద్దామనుకుని కథల రాయడం మొదలు పెట్టాడు. ఎక్కువగా ఇంట్లో ఉండి కథ రాసుకోవడం వలన తన దగ్గర రాత్రిపూట వేసుకునే కుర్తా పైజామానే ధరించాడు. అలా రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత కుర్తా బాగా కంఫర్ట్ గా అనిపించింది. దీంతో రోజు ఖాళీగా ఇంట్లో జీన్స్, షర్ట్స్ వేసుకొని ఏం తిరుగుతాం అని, కుర్తా పైజామా వేసుకోవడానికి అలవాటు పడిపోయాడు. ఈ కారణంగానే ఇప్పుడు ూడా ఎక్కువ సందర్భాల్లో బయట కూడా కుర్తాలతోనే కనిపిస్తాడు సందీప్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగా ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు