AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya 369 Movie: ‘ఆదిత్య 369’ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? బాలయ్య ఎలా వచ్చాడంటే?

కొన్ని సినిమాలు కొందరు హీరోలకే రాసిపెట్టుంటాయి. అలా ఆదిత్య 369 సినిమా బాలయ్యకే రాసి పెట్టి ఉందేమో! సింగీతం తెరకెక్కించిన ఈ టైమ్ ట్రావెలింగ్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్యన రీ రిలీజ్ లోనూ ఈ సినిమాను ఎగబడి చూశారు.

Aditya 369 Movie: 'ఆదిత్య 369' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? బాలయ్య ఎలా వచ్చాడంటే?
Balakrishna Aditya 369
Basha Shek
|

Updated on: Oct 24, 2025 | 9:39 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్స్ ఉండవచ్చు. కానీ ఆదిత్య 369 మూవీ మాత్రం ఆయన కెరీర్ లో చాలా స్పెషల్. సుమారు 34 ఏళ్ల క్రితం అంటే 1991లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆదిత్య 369 సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదేనని చెప్పుకోవచ్చు. టైమ్ మెషిన్ సహాయంతో శ్రీకృష్ణదేవరాయల నాటి కాలానికి వెళ్లడం, భవిష్యత్ ను ముందే ఊహించడం వంటి విషయాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేశాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన మోహినీ నటించింది. అలాగే సిల్క్ స్మిత, టినూ ఆనంద్, అమ్రిష్ పురి, మాస్టర్ తరుణ్ (హీరో తరుణ్), జేవీ సోమయాజులు, సుత్తివేలు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతీ రావు, చలపతి రావు, తనికెళ్ల భరణి ఇలా చాలామంది ప్రముఖులు వివిధ పాత్రలు పోషించారు. అయితే బాలయ్య నటనే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ లో యాక్ట్ చేశారు. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా తన నటనతో ఆడియెన్స్ ను అబ్బురపరిచారు. అయితే ఇందులో కృష్ణ కుమార్‌ పాత్రకు మొదట కమల్‌ హాసన్‌ ను అనుకున్నారట దర్శక నిర్మాతలు. శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర మాత్రం బాలకృష్ణ తోనే చేయించాలని అనుకన్నారట. ఇలా ఇద్దరు స్టార్ హీరోలైన బాలయ్య, కమల్‌లతో కలిసి ఈ మూవీని ఓ మల్టీస్టారర్ గా తీర్చిదిద్దాలని భావించారట. కమల్ కు కథ కూడా చెప్పారట. అయితే అప్పటికే కమల్ హాసన్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం కాలేదట. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో పాటు కృష్ణకుమార్ గానూ బాలయ్యే నటించారట.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీతో కమల్ హాసన్..

View this post on Instagram

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

కాగా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించే యోచనలో ఉన్నారు బాలకృష్ణ. ఇందులో ఆయన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా నటించవచ్చునని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.