Pawan Kalyan: ‘పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను’: మెగా డాటర్ సుస్మిత

మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతోంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్ల కష్టం ఫలించి పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Pawan Kalyan: 'పవన్ బాబాయి కాదు.. పెద్దన్న.. గెలవాలని ప్రేయర్స్ చేశాను': మెగా డాటర్ సుస్మిత
Pawan Kalyan, Sushmita Konidela
Follow us

|

Updated on: Jun 18, 2024 | 7:32 AM

మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతోంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్ల కష్టం ఫలించి పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా జనసేన అధిపతి విజయంపై మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, నిర్మాత సుస్మితా కొణిదెల స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కల్యాణ్ తో తనకున్న అటాచ్ మెంట్, అనుబంధాన్ని అందరితో షేర్ చేసుకుంది. ‘ పవన్ బాబాయ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నాగ‌బాబు బాబాయ్ అంటే.. చిన్న‌ప్ప‌టి నుంచి బాబాయి, నాన్న త‌ర్వాత ఆయ‌నే అన్న‌ట్లు ఫీలింగ్. కానీ పవన్ బాబాయ్ అలా కాదు. ఒక పెద్ద అన్న అనే ఫీలింగ్. న‌న్ను, చ‌ర‌ణ్ ని బాగా ఆటపట్టిచ్చే వాళ్లు. మా ఇద్ద‌రికీ గొడ‌వ పెట్టేసి కొట్టుకుంటుంటే చూసి ఎంటర్ టైన్ అయ్యేవారు’

కల్యాణ్ బాబాయిలో గత పదేళ్లుగా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఆయనను చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో నాకు పెద్దగా నాలెజ్డ్ చేయ లేదు కానీ.. బాబాయి గెలవాలని ప్రేయర్స్ చేశాను. ఆయ‌నను చూసిన‌ప్పుడ‌ల్లా ధ‌ర్మం ఎప్ప‌టికైనా గెలుస్తుంది అనుకునేదాన్ని. అదే న‌మ్మాను. అలాంట‌ప్పుడు విమర్శలు, ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయవు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు నాకు మాత్రం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి’ అని ఎమోషనలైంది సుస్మిత. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా సుస్మితా కొణిదెల‌ పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. అలాగే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరకెక్కించింది. సుస్మిత  నిర్మించిన ‘ప‌రువు’ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.