Tollywood: తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. ప్రభాస్ సినిమాలో అలాంటి రోల్ చేసిన వయ్యారి.. ఎవరంటే..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం సినిమాలకు దూరమైనా.. రాజకీయాల్లో బిజీగా ఉంది.

Tollywood: తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. ప్రభాస్ సినిమాలో అలాంటి రోల్ చేసిన వయ్యారి.. ఎవరంటే..
Actress
Follow us

|

Updated on: Jun 18, 2024 | 7:50 AM

సినీపరిశ్రమలో చాలా మంది నటీమణులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, పిల్లలు అంటూ ప్రస్తుతం తమ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? ప్రస్తుతం సినిమాలకు దూరమైనా.. రాజకీయాల్లో బిజీగా ఉంది. తనే హీరోయిన్ నమిత.

సూరత్‏కు చెందిన నమిత 17 ఏళ్లకే మిస్ సూరత్‏గా ఎంపికయ్యింది. ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానం సంపాదించుకుంది. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నమిత.. 2002లో ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన సొంతం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్. దీంతో వెంటనే విక్టరీ వెంకటేశ్ సరసన జెమిని సినిమాలో ఛాన్స్ అందుకుంది. తెలుగులో ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, ఐతే ఏంటీ, నాయకుడు, వ్యాపారి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన నమితకు ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఈ బ్యూటీ కాస్త బొద్దుగా మారిపోయింది. దీంతో ఆఫర్స్ రాలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న నమిత.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్‏గా కనిపించింది.

బొద్దుగా ఉన్నప్పటికీ ఈ మూవీ గ్లామర్ లుక్స్‏తో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత బాలయ్య నటించిన సింహా సినిమాలో సింహవంటి చిన్నోడే అంటూ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. అటు గ్లామర్ రోల్స్.. ఇటు స్పెషల్ సాంగ్స్ చేసినా నమితకు ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన నమితా.. 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం నమిత రాజకీయాల్లో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక
10 మంది మొబైల్ యూజర్లలో 9 మందికి కాల్ డ్రాప్ సమస్య..కీలక నివేదిక