Brahma Anandam Review: బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ.. తండ్రి కొడుకులు కలిసి నటించిన సినిమా ఎలా ఉందంటే..
మళ్లీరావా, ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు రాహుల్ యాదవ్ నక్కా. తాజాగా ఈయన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో 'బ్రహ్మా ఆనందం' సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..

మూవీ రివ్యూ: బ్రహ్మ ఆనందం
నటీనటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల, ప్రియా వడ్లమాని, దివిజ ప్రభాకర్ తదితరులు
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సినిమాటోగ్రఫీ: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పిసపాటి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఆర్వీఎస్ నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
మళ్లీరావా, ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ్ ఎంటర్‌టైన్మెంట్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు రాహుల్ యాదవ్ నక్కా. తాజాగా ఈయన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘బ్రహ్మా ఆనందం’ సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..
కథ:
చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి తెలియకుండానే సెల్ఫిష్ అయిపోతాడు బ్రహ్మనందం (రాజా గౌతమ్). కాకపోతే చిన్నప్పటి నుంచే నాటకాలు, నటన అంటే పిచ్చి. అందుకే ఎన్నేళ్లైనా కూడా అక్కడే ఉండి తన టాలెంట్ చూపించుకోవాలని అవకాశం కోసం చూస్తుంటాడు బ్రహ్మానందం. అతడికి జీవితంలో అన్ని విధాలా తోడుండే స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్). తొమ్మిదేళ్లుగా ఏ ఉద్యోగం లేకుండా అప్పుల్లో కూరుకుపోయిన బ్రహ్మానందానికి ఓ ప్రేయసి ఉంటుంది. ఆమె తార (ప్రియ వడ్లమాని). అతడికి సాయం చేయాలని అనుకుంటుంది. కానీ తన స్వార్థం కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని తెలిసి బ్రహ్మానందాన్ని వదిలేసి వెళ్లిపోతుంది తార. మరోవైపు తన లైఫ్ సెటిల్ అవ్వడానికి బ్రహ్మాకు 6 లక్షలు అవసరం పడుతుంది. అదే సమయంలో బ్రహ్మ జీవితంలోకి వస్తాడు మూర్తి ( బ్రహ్మానందం). తాను చెప్పినట్లు చేస్తే ఊళ్ళో తనకున్న 6 ఏకరాలు అమ్మి డబ్బులు ఇస్తానంటాడు. అది విని వెంటనే మూర్తి వెంట ఊరికి వచ్చేస్తాడు బ్రహ్మానందం. అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాకు జ్యోతి (రామేశ్వరి)తో మూర్తికి ఉన్న అనుబంధం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..
కథనం:
వృధ్యాప్యంలో ఒంటరి తనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నాడు దర్శకుడు నిఖిల్. దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నాడు.. కాకపోతే అనుభవలేమితో కథనంలో తప్పులు చేసాడు. దాంతో మంచి సినిమా అవుతుందనుకున్న బ్రహ్మానందం.. సగంలోనే ఆగిపోయింది. కథలో కన్‌ఫ్యూజన్ పెరిగిపోయి.. చివరికి ఏం చెప్పాలో దర్శకుడికే అర్థం కాకుండా పోయింది. సినిమా కంటే కొన్నిసార్లు కాంబినేషన్స్ క్యూరియాసిటీ పెంచేస్తుంటాయి.. బ్రహ్మ ఆనందం సినిమా విషయంలో అలాగే అనిపించింది. తండ్రీ కొడుకులు.. తాత మనవళ్లు అనేసరికి ఓ తెలియని ఆసక్తి.. కాంబినేషన్ కలపడంతోనే తన పనైపోయిందనుకున్నాడు దర్శకుడు నిఖిల్. కథ విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసుంటే సినిమా మరింత బాగా వచ్చుండేది. ఏదో నాలుగు కామెడీ సీన్లు, నాలుగు ఎమోషనల్ సీన్లు అన్నట్లు సాగిపోయింది. ఫస్టాప్ కాస్తో కూస్తో బెటర్.. ఇంటర్వెల్ వరకు అలా అలా వెళ్తుంది. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ అంతా ఎటెటో వెళ్లిపోయింది. వెన్నెల కిషోర్ ఉన్నాడు కాబట్టి అక్కడక్కడా కాస్త నవ్వించాడు కానీ లేదంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది. సినిమా అంతా వెన్నెల కిషోర్ ఒక్కడే మోసాడు అనిపించింది. మనోడు కనిపించిన ప్రతీసారి నవ్వొచ్చింది. హీరో పెట్టుకున్న గోల్ ఏమవుతుందో సెకండాఫ్‌లో అర్థం కాదు. బ్రహ్మి, రాజా గౌతమ్ మధ్య ఇంకాస్త మంచి సీన్స్ రాసుకునే అవకాశం ఉన్నా కూడా వదిలేసాడు దర్శకుడు నిఖిల్. అంతేకాదు సెకండాఫ్‌లో కథనం కూడా అర్థం కాదు. సంపత్ క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ కంటే కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఎమోషనల్ సీన్స్ పడాల్సిన చోట కథను కామెడీ చేసాడు దర్శకుడు. అందుకే సగమే ఆనందం మిగిలి.. మిగిలిన సగం భారంగా గడిచింది బ్రహ్మ ఆనందం.
నటీనటులు:
బ్రహ్మానందం ఎందుకో అంత న్యాచురల్‌గా నటించలేదు అనిపించింది. స్క్రీన్ మీద మామూలుగానే రప్ఫాడించే బ్రహ్మికి ఏజ్ అయిపోయిందేమో అనిపించింది. మరోవైపు రాజా గౌతమ్ మాత్రం చాలా బాగున్నాడు. నటనలో పరిణతి కనిపించింది. వెన్నెల కిషోర్ సినిమాకు సేవియర్. సినిమా అంతా ఉంటాడు.. ఉన్నంత సేపు వన్ లైనర్స్‌తో బాగానే నవ్వించాడు వెన్నెల కిషోర్. ప్రియా వడ్లమాని ఓకే.. ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ మాత్రం ఉన్న కొన్ని సీన్స్‌లో అయినా చాలా న్యాచురల్‌గా నటించింది. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
శాండిల్య అందించిన సంగీతం పర్లేదు. ఆనందమానందమాయే పాట బాగుంది. ఆర్ఆర్ అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సిందేమో.. కాకపోతే దర్శకుడి నిర్ణయం కాబట్టి తప్పు బట్టలేం. సినిమాటోగ్రఫీ పర్లేదు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కథకు తగ్గట్లుగా ఖర్చు చేసారు. దర్శకుడు నిఖిల్ ఇంకాస్త రైటింగ్ పరంగా ఆకట్టుకుని ఉండుంటే బాగుండు. మంచి కథే తీసుకున్నా.. ఫీల్ మిస్ అయింది. కామెడీపైనే ఎక్కువగా ఫోకస్ చేసి ఎమోషన్ మిస్ చేసాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా బ్రహ్మ ఆనందం.. సగం భ్రమ.. సగం ఆనందం..!
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన