AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పాట్నాలో ల్యాండయిన పుష్ప రాజ్.. ఎయిర్ పోర్టులో అద్దిరిపోయే వెల్కమ్.. వీడియో ఇదిగో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ఫ 2 : ది రూల్. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.

Pushpa 2: పాట్నాలో ల్యాండయిన పుష్ప రాజ్.. ఎయిర్ పోర్టులో అద్దిరిపోయే వెల్కమ్.. వీడియో ఇదిగో
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Nov 17, 2024 | 3:49 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో చిత్రం పుష్ఫ 2. మూడేళ్ల క్రితం రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ఫ సినిమాకు ఇది సీక్వెల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని హంగులు పూర్తి చేసుకున్న పుష్ప 2 డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్లు, టీజర్స్, సాంగ్స్ కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పుష్ప సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం (నవంబర్ 17)న సాయంత్రం విడుదల చేయనున్నారు. బిహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నగరంలో గాంధీ మైదానంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్ కోసం చిత్రబృంద సభ్యులు ఒక్కొక్కరు పాట్నా చేరుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా పాట్నా చేరుకున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా కూడా పాట్నాలో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ లో వీరికి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

పాట్నాలోని గాంధీ మైదానంలో సాయంత్రం సరిగ్గా 6 గంటల మూడు నిమిషాలకు పుష్ఫ 2 ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డాలీ ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్ ఘోష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.

పాట్నా ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి