Allu Arjun: బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఐకాన్ స్టార్.. సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?

ఇటీవలే పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

Allu Arjun: బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఐకాన్ స్టార్.. సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా.. ?
Sanjay Leela Bhansali, Allu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 1:07 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప ది రైజ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాహుబలి రికార్డ్ సైతం బ్రేక్ చేసింది. మరోవైపు ఇటు సంక్రాంతి సెలవులలోనూ ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ రీసెంట్‌గా ముంబై వెళ్లాడు. అక్కడ డైరెక్టర్ భన్సాలీ ఆఫీసులో కనిపించాడు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉండొచ్చనని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఆ తర్వాత అల్లు అర్జున్ తో భన్సాలీ సినిమా కోసం మరోసారి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది స్టార్ హీరోతో సినిమా చేయాలన్నది భన్సాలీ కల. దీంతో ఇప్పుడు అతడి కల నిజమైందని అంటున్నారు నెటిజన్స్. మరోవైపు అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు భన్సాలీతో బన్నీ సినిమా చేయనున్నాడనే ప్రచారం మొదలైంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.