Tollywood: ద్యావుడా.. బాక్సాఫీస్ క్వీన్ ఆమె.. ఇండస్ట్రీలో 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు నటించిన సినిమాలు థియేటర్లలో ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ మీకు తెలుసా.. ఇండస్ట్రీలో దాదాపు రూ.10 వేల కోట్లు వసూళ్లు సాధించిన ఏకైక హీరోయిన్ ఎవరో.. ?

Tollywood: ద్యావుడా.. బాక్సాఫీస్ క్వీన్ ఆమె.. ఇండస్ట్రీలో 10 వేల కోట్లు వసూలు సాధించిన ఏకైక హీరోయిన్..
Deepika Padukone
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2025 | 12:46 PM

కొన్నాళ్లుగా సౌత్ హీరోలు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను ఏలేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వస్తూ ఏకంగా రూ.1000 కోట్లు రాబడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్, రిషబ్ శెట్టి వంటి సౌత్ ఇండస్ట్రీ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. అలాగే హిందీలోనూ షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు వెయ్యి కోట్లు వసూలు చేశాయి. అయితే వీరంతా కలిసి రూ.1000 కోట్లకు పైగా రాబట్టగా.. రూ.10 వేల కోట్లు అందుకోలేకపోయారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం పదివేల కోట్లు రాబట్టింది. ఆమె బాక్సాఫీస్ క్వీన్. గత దశాబ్దంలోనే హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ దీపికా పదుకొణె.

దీపికా పదుకొణె.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావొస్తుంది. ఆమె 18 సంవత్సరాల సినీప్రయాణంలో దీపికా నటించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.10,200 కోట్లు రాబట్టాయి. ఇందులో భారతీయ సినిమాల నుంచి రూ.8000 కోట్లు.. హాలీవుడ్ మూవీస్ నుంచి 2200 కోట్లు ఉన్నాయట. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోల సినిమాలో గ్లామర్ పాత్రలు పోషించారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. ఇన్నాళ్లు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. గత రెండేళ్లలో పఠాన్, జవాన్, కల్కి వంటి చిత్రాలతో వరుసగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా 6 వేల కోట్లు.. కత్రినా కైఫ్ 5500 కోట్లు రాబట్టిన సినిమాల్లో నటించారు. ఇక షారుఖ్ ఖాన్ 9వేల కోట్లు.. అక్షయ్ కుమార్ 8300 కోట్ల సినిమాల్లో నటించారు. మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న దీపికా.. ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరో సినిమా ప్రకటించకుండా తన పాపతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.