మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలు

Phani CH

|

Updated on: Jan 10, 2025 | 12:23 PM

కొద్దిరోజుల క్రితం టీవీ9 జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మోహన్ బాబు. అయితే ఈ కేసు విషయంలో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.

అంతేకాదు ఈ కేసులో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. విచారణలో భాగంగా న్యాయస్థానం ఇరువురి తరపు న్యాయవాదులను పలు ప్రశ్నలు అడిగింది. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా ? అని మోహన్ బాబు తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పామన్నారు. అది కేవలం ఆవేశంలో జరిగిందని.. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మోహన్ బాబు తరుపు లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 76 ఏళ్ల వయసున్న మోహన్ బాబు కావాలని దాడి చేయలేదని.. అది ఆవేశంలో జరిగిందని.. జర్నలిస్టులు గుంపుగా తన ఇంట్లోకి ట్రెస్ పాస్ చేయడంతో ఇలా జరిగిందన్నారు. ఈ మేరకు ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే ?? OTTలో నయా థ్రిల్లర్ మూవీ

Game Changer: రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి