భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే ?? OTTలో నయా థ్రిల్లర్ మూవీ

భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే ?? OTTలో నయా థ్రిల్లర్ మూవీ

Phani CH

|

Updated on: Jan 10, 2025 | 12:21 PM

తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా దక్షిణాదిలో థ్రిల్లింగ్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందులో అథోముగం ఒకటి. ప్రస్తుతం IMDB లో 7 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. స్పై థ్రిల్లర్‏గా వచ్చిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ దేవ్ దర్శకత్వం వహించారు.

గతేడాది మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, చైతన్య ప్రతాప్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈ ఇద్దరూ. తమిళంతోపాటు మలయాళంలో ఒకేరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అనంత్ నాగ్, అరుణ్ పాండియన్ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. జనవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఆహా తమిళంలో మాత్రం ఈ చిత్రం ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఇక థియేటర్లలో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుండడంతో ఇప్పుడు ఈ సినిమాపై యూత్‌ లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Game Changer: రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి

ఇస్రో ప్రయోగం సక్సెస్‌.. ఇక అంతరిక్షంలోనూ వ్యవసాయం..