Pushpa Allu Arjun: పుష్ప క్రేజ్ మాములుగా లేదుగా.. పది రోజుల్లోనే రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar).. బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాలో హిందీలో కలెక్షన్ల సునామి సృష్టించింది. పుష్ప సినిమా మాత్రమే కాదు.. ఇందులోని పాటలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక పుష్పరాజ్ మేనరిజానికి విదేశీయులు సైతం అట్రాక్ట్ అయ్యారు. క్రికెటర్స్, ఇతర విదేశీయులు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ స్టైల్‌కు ఫిదా అయ్యారు. దీంతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది .
దీంతో బన్నీ ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇటీవల 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అల్లు అర్జున్.. పది రోజుల్లోనే 1 మిలియన్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. పుష్ప క్రేజ్‌తో కేవలం పది రోజుల్లోనే సోషల్ మీడియా రికార్డ్ బ్రేక్ చేశాడు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరిలో పుష్ప ది రూల్ షూరు కానుంది. ఇందులో సునీల్, రష్మిక మందన్న, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
View this post on Instagram
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..