Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..
Aadavallu Meeku Joharlu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 28, 2022 | 7:39 PM

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్..

ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు హీరో శర్వానంద్. ఈ సినిమాతోపాటు… శర్వానంద్ ఓకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..

Anupama parameswaran: క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు తో క్యూట్ స్మైల్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ..

Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

Teaser Talk: రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి.. ఆస‌క్తిక‌రంగా భళా తందనాన టీజ‌ర్‌..