Teaser Talk: రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి.. ఆస‌క్తిక‌రంగా భళా తందనాన టీజ‌ర్‌..

Bhala Thandhanana Teaser: వైవిధ్య‌భ‌రిత‌మైన కథాంశాల‌ను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. క‌థ‌కు ప్రాధాన్య‌త ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శ్రీ విష్ణు తాజాగా న‌టిస్తోన్న చిత్రం...

Teaser Talk: రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి.. ఆస‌క్తిక‌రంగా భళా తందనాన టీజ‌ర్‌..
Bhala Thandanana Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 28, 2022 | 12:43 PM

Bhala Thandhanana Teaser: వైవిధ్య‌భ‌రిత‌మైన కథాంశాల‌ను ఎంచుకుంటూ డీసెంట్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. క‌థ‌కు ప్రాధాన్య‌త ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శ్రీ విష్ణు తాజాగా న‌టిస్తోన్న చిత్రం భ‌ళా తంద‌నాన‌. వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా కేథ‌రిన్ థెరిస్సా న‌టిస్తోంది.

చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ్డ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. తాజాగా శుక్ర‌వారం భ‌ళా తంద‌నాన టీజ‌ర్‌ను న్యాచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. 1.34 నిమిషం నిడివి ఉన్న ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది.

సినిమా సినిమాకు న‌ట‌న‌లో ఆరితేరుతోన్న శ్రీవిష్ణు ఇందులో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో పొలిటిక‌ల్ మార్క్ డైలాగ్‌లు సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ముఖ్యంగా.. రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి, నేను మాములు మనిషినే, సీఎం కుర్చిలో కూర్చున్న ఎవ్వ‌రైనా ఒక్క సంత‌కంతో రాష్ట్రం భ‌విష్య‌త్తును మార్చ‌వ‌చ్చు. అంటే ఆ ప‌వ‌ర్ చేతిదా, కుర్చీదా.? అనే డైలాగ్‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. మ‌రి మ‌రో వైవిధ్య క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న శ్రీవిష్ణు ఈసారి ఎలాంటి హిట్‌ను అందుకుంటాడో చూడాలి. ఈ ఆసక్తిక‌ర‌మై టీజ‌ర్‌ను మీరూ ఓసారి చూసేయండి..

Also Read: Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..

Shruti Haasan: నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న శృతి హసన్.. బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కమల్ తనయ..