AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న శృతి హసన్.. బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కమల్ తనయ..

Shruti Haasan Birthday: దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) పుట్టినరోజు నేడు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), అలనాటి అందాల నటి సారిక(Sarika)ల కుమార్తె శ్రుతి హాసన్. సింగర్, మ్యూజిక్ కంపోజర్,..

Shruti Haasan: నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న శృతి హసన్.. బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కమల్ తనయ..
Shruti Hassan
Surya Kala
|

Updated on: Jan 28, 2022 | 9:10 AM

Share

Shruti Haasan Birthday: దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) పుట్టినరోజు నేడు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), అలనాటి అందాల నటి సారిక(Sarika)ల కుమార్తె శ్రుతి హాసన్. సింగర్, మ్యూజిక్ కంపోజర్, నటి.. మల్టి టాలెంటెడ్ పర్సన్. తల్లిదండ్రులకు తగిన తనయ బాలీవుడ్ లో నటిగా అడుగు పెట్టిన శ్రుతి అనంతరం టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈరోజు (జనవరి 28వ తేదీ) శృతి హాసన్ పుట్టినరోజు ( హ్యాపీ బర్త్ డే శృతి హాసన్ ). 35 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటుంది అందాల సుందరి.

తల్లిదండ్రుల నుంచి నటనను వారసత్వంగా తీసుకున్న శ్రుతి హాసన్ 2000లో బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించింది. తండ్రి ఈనాడు సినిమాలో టైటిల్ సాంగ్ ను పాడి.. తనలో గాయనిని కూడా ప్రేక్ష్జకులకు పరిచయం చేసింది. అనతరం బాలీవుడ్ లో 2008లో “లక్” సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ తోలి రోజుల్లో నటనకు మంచి ప్రశంసలు అందుకున్నా.. సూపర్ హిట్ సినిమా అందుకోవడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. టాలీవుడ్ లో 2011లో “అనగనగా ఓ ధీరుడు” సినిమాలో నటించింది. ఈ సినిమాలోని నటనకు గాను శ్రుతి ఉత్తమ తెలుగు నూతన నటి గా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన నటించిన 7వ సెన్స్ సినిమాలో నటించిన శ్రుతి బెస్ట్ తమిళ హీరోయిన్ గా మళ్ళీ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

అయితే కోలీవుడ్ లో మొదటి హిట్ అందుకున్న సినిమా ధనుష్ హీరోగా నటించిన 3 మూవీ అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ , హరీష శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ గా నిలవడమే కాదు.. శ్రుతి హసన్ కెరీర్ ను ఓ రేంజ్ లో మలుపు తిప్పింది. అనతరం వరసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది.మహేష్ బాబుతో శ్రీమంతుడు, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన “రామయ్యా వస్తావయ్యా”, రవితేజ సరసన “బలుపు”,వంటి అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. రవితేజ తో క్రాక్ సినిమతో ఇటీవలే సూపర్ హిట్ అందుకుంది

Also Read:

ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌..!(వీడియో)