Allu Arjun: దుబాయ్ స్కైలైన్ ను చూసి చిల్ అవుతోన్న బన్నీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

'పుష్ఫ' (Pushpa) తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో  మిశ్రమ స్పందనలు అందుకున్నా.. ఆ తర్వాత జోరందుకుంది

Allu Arjun: దుబాయ్ స్కైలైన్ ను చూసి చిల్ అవుతోన్న బన్నీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2022 | 9:00 AM

‘పుష్ఫ’ (Pushpa) తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).  గతేడాది డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రారంభంలో  మిశ్రమ స్పందనలు అందుకున్నా.. ఆ తర్వాత జోరందుకుంది.  తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో  కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో బన్నీ నటనకు  అందరూ ఫిదా అవుతున్నారు. ఇక పుష్ప పాటలు, డైలాగులు, డ్యాన్సులకు  సోషల్‌ మీడియాలో ఉంటోన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా ‘పుష్ప’ సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఆస్వాదించే పనిలో పడ్డాడు. అందుకే కుటుంబంతో కలిసి దుబాయి వెకేషన్ (Dubai Vacation) కు వెళ్లాడు.  దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరలయ్యాయి.

త్వరలోనే ‘పుష్ఫ2’ షూటింగ్ ప్రారంభం..

కాగా  దుబాయిలోని స్కైలైన్‌ వ్యూని ఎంజాయ్‌ చేస్తూ స్టైలిష్‌గా నిలబడిన ఫొటో ఒకటి బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.  కాగా దుబాయి నుంచి రాగానే ‘పుష్ప–2.. ది రూల్ ’ చిత్రీకరణలో బన్నీ పాల్గొననున్నాడు.   ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. వీటితో పాటు తన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే పనిలో ఉన్నాడు. వేణుశ్రీరామ్, కొరటాల శివతో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నా ఏవీ అధికారికంగా ప్రకటించలేదు . తాజాగా అట్లీ కూడా బన్నీతో సినిమా చేయనున్నాడన్న ప్రచార సాగుతోంది.

Also read:Sanya Malhotra: సాన్యా.. యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్.. దంగల్ బ్యూటీపై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

Akhanda: మళ్లీ షురూ కానున్న అఖండ మాస్ జాతర.. నేడు అక్కడ థియేటర్లలో విడుదల కానున్న బాలయ్య మూవీ..

Parenting Tips: పసి పిల్లల పెంపకంలో తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలివే ..