Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..

కరోనా మహమ్మారి (covid 19)  ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టేలా లేదు. సుమారు రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ (Corona Virus) ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రూపం, ఉనికిని మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని భయపెడుతోంది.

Coronavirus: భారత్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. భారీగా వెలుగు చూస్తోన్న కేసులు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2022 | 11:29 AM

కరోనా మహమ్మారి (covid 19)  ఇప్పట్లో మనల్ని విడిచిపెట్టేలా లేదు. సుమారు రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ (Corona Virus) ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. తన రూపం, ఉనికిని మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇక ఇండియా(India) లోనూ లక్షలాది మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే రెండు వేవ్ లు దేశాన్ని కుదిపేశాయి. ఇప్పుడు మూడో ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ (Omicron) కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అదే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (Omicron Sub Variant) BA.2.

అందుకే దీనిని గుర్తించలేకపోతున్నాం!

దేశంలో ఒమిక్రాన్  సబ్ వేరియంట్ BA.2 కేసులు  పెరుగుతున్నాయని తాజాగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం భారత దేశంలో BA.1 వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ సబ్  వేరియంట్ BA.2 ఎక్కువగా ఉంది.  ఇంతకుముందు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలలో BA.1 వేరియంట్ ప్రబలంగా ఉండేది. ఇప్పుడు  BA.2 సబ్ వేరియంట్ ఎక్కువగా కనిపిస్తోంది .  ఒమిక్రాన్ BA.1 తో పోల్చితే ఇందులో రకరకాల మ్యుటేషన్లు ఉన్నాయి. అందుకే ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో దీనికి గుర్తించడం కష్టమవుతోంది’ అని సుజీత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

49 దేశాల్లో ..

కాగా ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ BA.2 సంబంధించిన కొవిడ్ కేసులు ఇప్పటికే బ్రిటన్‌లో చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా డెన్మార్క్, నార్వే, స్వీడన్, సింగపూర్ తదితర  దేశాల్లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. outbreak.info వెబ్‌సైట్ ప్రకారం ఇప్పటివరకు 49 దేశాలలో  BA.2 కేసులు నమోదయ్యాయి.  ఇది BA.1 వేరియంట్ కంటే తీవ్రంగా కనిపిస్తోందని అయితే వేగంగా వ్యాప్తిచెందేందుకు ఎటువంటి ఆధారాలు లేవని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Also read:Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య..

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..

Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ.. హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..