Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రఘుదేవపురం (Raghudeva Puram) గ్రామంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది.

Crime News: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన భార్య..
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2022 | 2:00 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రఘుదేవపురం (Raghudeva Puram) గ్రామంలో ఓ మహిళ తన భర్తను అతికిరాతకంగా  హత్య చేసింది. అంతే కాకుండా నేరం నుంచి తప్పించుకోవడానికి  తన భర్త మూర్ఛవ్యాధి కారణంగా చనిపోయాడని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. కాగా మృతుని శరీరంపై గాయాలను పరిశీలించిన నార్త్ జోన్ పోలీసులు ఇది హత్యేనని నిర్ధారించారు.   భార్యే అతనని హత్య చేసిందని  పోలీసులు చెబుతున్నారు.  కాగా మృతదేహాన్ని  పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మద్యం మత్తులో..

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన మర్రే అబ్బులు(46), ముత్యాలు భార్యాభర్తలు. వీరికి మద్యం తాగే అలవాటుంది. బుధవారం రాత్రి కూడా ఇద్దరూ తాగి గొడవపడి బయటకు వెళ్లిపోయారు.  కాగా తెల్లవారుజాము ముత్యాలు మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది.  మరోవైపు రాపాక గ్రామ శివారు కల్వర్టు వద్ద ఓ మృతదేహం ఉందని పోలీసులకు ఫిర్యాదు  అందింది. వారితో పాటు స్థానికులు, ముత్యాలు అక్కడికి చేరుకున్నారు.  తన భర్త కు ఫిట్స్‌ (మూర్ఛవ్యాధి) సమస్య ఉందని, దాని వల్లే చనిపోయాడని  భర్త  మృతదేహాన్నిదహన సంస్కారాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. అయితే మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అదేవిధంగా పురుషాంగం కోసేసి ఉండడంతో పోలీసులకు అనుమానమొచ్చింది.  దీంతో పోలీసులు విచారించగా మృతుడి భార్యే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అంగీకరించింది.

Also read:

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..

Tomato Coriander Rice: పిల్లలు ఇష్టంగా తినే టమాటా కొత్తిమీర రైస్ కేవలం 15 నిమిషాల్లోనే చేయండి ఇలా

Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ.. హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..