AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ.. హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా  చిత్రం 'పుష్ఫ' ( Pushpa). రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటించగా, సమంత (Samantha) స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది

Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ..  హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..
Pushpa
Basha Shek
|

Updated on: Jan 28, 2022 | 9:34 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా  చిత్రం ‘పుష్ఫ’ ( Pushpa). రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటించగా, సమంత (Samantha) స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గతేడాది డిసెంబర్ లో  విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చినా  జనాలు థియేటర్లలోనే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనూ బన్నీ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేయకపోయినా,  కేవలం డబ్బింగ్ వెర్షన్‌తోనే  రికార్డుల మోత మోగించేస్తోంది. ఈ క్రమంలో పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్లను కలెక్ట్ చేసిందని బాలీవుడ్ నటుడు, ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ వెల్లడించారు.

వారికి చెంప పెట్టు..

‘పుష్ప’ హిందీ వెర్షన్ 100 కోట్ల బిజినెస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఈ గొప్ప రికార్డు అందుకున్నందుకు బన్నీకి అభినందనలు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అని చెప్పుకునే ఎంతో మందికి ఇది చెంపపెట్టు లాంటిది.  వారి స్ట్రెయిట్ సినిమాలు కేవలం 25 కోట్ల వసూళ్లు  సాధించడానికి నానా తంటాలు పడుతున్నాయి. అలాంటిది ఒక  తెలుగు డబ్బింగ్ చిత్రం 100 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది.  బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో ‘పుష్ప’ నే ప్రత్యక్ష నిదర్శనం’  అని వరుసగా ట్వీట్లు పెట్టాడు కేఆర్ కే.  కాగా ఈ సినిమాను  హిందీలో డిస్ట్రి బ్యూట్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీశ్ షాకు బన్నీ బంగారు గనిగా మారిపోయాడని  మరో ట్వీట్ లో రాసుకొచ్చారు.

Also Read: Allu Arjun: దుబాయ్ స్కైలైన్ ను చూసి చిల్ అవుతోన్న బన్నీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

Sanya Malhotra: సాన్యా.. యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్.. దంగల్ బ్యూటీపై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్