AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

1983లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)  తొలి ప్రపంచకప్ అందుకోవడం ఆధారంగా రూపొందించిన చిత్రం 83.  క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ (Kapil Dev) జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రంలో కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)

83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
83 Movie
Basha Shek
|

Updated on: Jan 28, 2022 | 6:19 AM

Share

1983లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)  తొలి ప్రపంచకప్ అందుకోవడం ఆధారంగా రూపొందించిన చిత్రం 83.  క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ (Kapil Dev) జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రంలో కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), ఆయన భార్య రోమి భాటియాగా దీపిక​ పదుకొణె(Deepika Padukone) నటించారు. హార్డీ సంధు,   తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా తదితరులు కీలకపాత్రలు పోషించారు . కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . హిందీతో పాటు తెలుగు, తమిళం,  కన్నడ, మలయాళం భాషల్లో  కూడా విడుదలై సినీ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో  అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

కాగా ఇప్పుడీ స్పోర్ట్స్ డ్రామా డిజిటల్ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఒకేసారి విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం,  కన్నడ, మలయాళం భాషల్లో ’83’ స్ట్రీమింగ్ కానుంది.  కాగా ఈ సినిమాకు ఇండియాతో పాటు  ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్లు వచ్చాయి.

Also Read: TRAI New Guidelines: టెలికం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు.. కస్టమర్లకు ఊరట..!

Parenting Tips: పసి పిల్లల పెంపకంలో తల్లులు పాటించాల్సిన జాగ్రత్తలివే ..

Post Office: మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్‌ తీయాలనుకుంటున్నారా..? ఈ నిబంధనలు తప్పనిసరి..!