Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత..

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2022 | 5:31 AM

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పెళ్లి సీజన్‌ వచ్చిందంటే చాలు జ్యూలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. శుక్రవారం (జనవరి 28)న దేశంలో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల ధరపై రూ.400 నుంచి 500 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది.

బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చోటు చేసుకుంటుండటం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణమనే చెప్పాలి. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు వెళ్లే సమయానికి ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు..!

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? సమాచారం కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌..!

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!